Don't Miss!
- Sports
IND vs NZ: ఇషాన్ కిషన్ పిల్ల చేష్టలపై ఐసీసీ సీరియస్.. కాపాడిన అంపైర్లు! లేకుంటే..?
- News
ఎమ్మెల్యేల ఎరకేసు: బీఎల్ సంతోష్, తుషార్ లకు సిట్ నోటీసులపై స్టే పొడిగింపు; ఎప్పటివరకంటే!!
- Finance
IPO Stock: చెలరేగిపోతున్న స్టాక్.. నెలలోనే షేరుకు రూ.100 లాభం.. మీ దర్గర ఉందా..?
- Lifestyle
Republic Day 2023: పిల్లల కోసం రిపబ్లిక్ డే స్పీచ్ ఐడియాలు.. ఈ టిప్స్ పాటిస్తే ప్రైజ్ మీదే
- Automobiles
భారత్‌లో Aura ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
- Technology
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Golden Globe హాలీవుడ్ రిపోర్టర్‌కు జూనియర్ ఎన్టీఆర్ షాక్.. ఊహించని గిఫ్ట్‌తో
ప్రపంచ వేదికలపై RRR చిత్రానికి అపూర్వమైన గౌరవం దక్కుతున్నది. గత కొద్దికాలంగా ప్రపంచంలో అత్యున్నత అవార్డులను గెలుచుకొంటూ.. ఆస్కార్ అవార్డులవైపు దూసుకెళ్తున్నది. అయితే జనవరి 11వ తేదీన లాస్ ఎంజెలెస్‌లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో రాజమౌళి దర్శకత్వం వహించిన నాటు నాటు సాంగ్‌కు ఒరిజినల్ మ్యూజిక్ కేటగిరిలో అవార్డును సొంతం చేసుకొన్నది. ఈ వేడుకలకు రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్, రాంచరణ్ తమ జీవిత భాగస్వాములతో హాజరయ్యారు. ఈ అవార్డుల కార్యక్రమంలో హాలీవుడ్ మీడియా వెరైటీకి ఎన్టీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. ఈ ఇంటర్వ్యూ వివరాల్లోకి వెళితే..

రాజమౌళి ట్రాక్ రికార్డు, ఆయనతో ఉన్న స్నేహం కారణంగా RRR చిత్రంలో నటించాను. ఈ సినిమా ఎన్నో వేదికలపై విన్నర్‌గా నిలిచింది. కానీ గ్లోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవడం స్పెషల్. జపాన్, అమెరికాలో RRR మీరు ఊహించని అద్బుతాలు చేస్తున్నది. త్వరలో జరుగనున్న ఆస్కార్ అవార్డు కోసం వేచి చూస్తున్నాం అని వెరైటీ రిపోర్టర్‌తో ఎన్టీఆర్ అన్నారు.

ఆ తర్వాత వెరైటీ రిపోర్టర్ సెలవు తీసుకొంటుండగా.. మీ కోసం ఒకటి తెచ్చాను. ఈ రోజు మీ బర్త్ డే కదా.. మీకు ఈ చిన్న కానుక. హ్యాపీ బర్త్ డే. నా బహుమతి మీకు బాగా నచ్చుతుంది. మరోసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు అని రిపోర్టర్‌కు ఎన్టీఆర్ షాకిచ్చాడు.
Talking lyk a Hollywood actor our global star ⭐️ @tarak9999 🔥🔥🔥 #ManOfMassesNTR #NTRGoesGlobal #NTR pic.twitter.com/Y5XmS9l0QF
— Mr Perfect (@kantri_munna09) January 11, 2023
అయితే హాలీవుడ్ రిపోర్టర్ బర్త్ డేను గుర్తు పెట్టుకొని.. ఆయన కోసం బహుమతిని కొనుగోలు చేయడంపై ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురుస్తున్నది. హాలీవుడ్‌లో గ్లోబల్ స్టార్ అంటూ అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు.
