నితిన్ షాకింగ్ డెసీషన్: ఆంధ్రా తెలంగాణ రాయలసీమ సెంటిమెంట్‌తో.. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ముందుకు!

'జయం' అనే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు యూత్ స్టార్ నితిన్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలు అందుకుని సత్తా చాటిన అతడు.. చిన్న వయసులోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. అయితే, చాలా కాలం పాటు వరుస పరాజయాలతో తీవ్ర స్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఇష్క్' తర్వాత మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి మరిన్ని విజయాలను అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల 'చెక్' అనే సినిమా చేసి మరో ఫ్లాప్‌ చవి చూశాడు. ఈ నేపథ్యంలో నితిన్ షాకింగ్ డెసీషన్ తీసుకున్నాడట. వివరాల్లోకి వెళ్తే...

లాక్‌డౌన్‌కు ముందు భారీ విజయం సొంతం

లాక్‌డౌన్‌కు ముందు భారీ విజయం సొంతం

'ఛలో' ఫేం వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్ నటించిన చిత్రం 'భీష్మ'. గత ఏడాది లాక్‌డౌన్‌కు ముందు విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాగే, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. తద్వారా నితిన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది.

ఈ ఏడాది ఘోర పరాభవాన్ని ఎదుర్కొంటూ

ఈ ఏడాది ఘోర పరాభవాన్ని ఎదుర్కొంటూ

విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి - నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'చెక్'. చదరంగం ఆట నేపథ్యంతో వచ్చిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఇది భారీ పరాభవాన్ని చవి చూసింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు.

‘రంగ్ దే' అని వస్తున్న యూత్ స్టార్ నితిన్

‘రంగ్ దే' అని వస్తున్న యూత్ స్టార్ నితిన్

2021 ప్రారంభంలోనే భారీ ఫ్లాప్‌తో ఇబ్బంది పడ్డాడు యూత్ స్టార్ నితిన్. ఇలాంటి పరిస్థితుల్లో తన తదుపరి చిత్రాన్ని విడుదల చేసేందుకు అతడు రెడీ అవుతున్నాడు. ఆ సినిమానే 'రంగ్ దే'. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మార్చి 26న ఇది రిలీజ్ కానుంది.

ప్రమోషన్ షురూ.. అక్కడ మొదలెట్టాడుగా

ప్రమోషన్ షురూ.. అక్కడ మొదలెట్టాడుగా

విడుదలకు సమయం దగ్గర పడడంతో 'రంగ్ దే' యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు పాటలను విడుదల చేసిన మూవీ టీమ్.. ట్రైలర్‌ను కూడా వదలబోతున్నట్లు తాజాగా వెల్లడించింది. ఇక, దీనిని మార్చి 19న కర్నూలులోని ఎస్టీబీసీ కాలేజ్‌లో సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కానున్న ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నారు.

ఆంధ్రా తెలంగాణ రాయలసీమ సెంటిమెంట్‌తో

ఆంధ్రా తెలంగాణ రాయలసీమ సెంటిమెంట్‌తో

తన గత చిత్రం ఫ్లాప్ అవడంతో.. 'రంగ్ దే' విషయంలో నితిన్ కీలక నిర్ణయం తీసుకున్నాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించి ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో మూడు ఈవెంట్లు నిర్వహించనున్నారట. ఇందులో ఒక చోట ట్రైలర్‌ లాంచింగ్, మరో చోట ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంకో చోట గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని టాక్.

జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ముందుకెళ్లాలని

జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ముందుకెళ్లాలని

ఇప్పటికే ట్రైలర్ లాంచ్ డేట్, వేదిక ప్రకటించింది 'రంగ్ దే' యూనిట్. ఆ తర్వాత కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మిగిలిన రెండు ఈవెంట్లు కూడా ప్లాన్ చేస్తారట. వీటిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా రాబోతున్నాడని సమాచారం. వెంకీ అట్లూరి అతడికి క్లోజ్ ఫ్రెండ్ కావడంతో పాటు నితిన్‌తోనూ స్నేహం ఉండడంతో యంగ్ టైగర్ దీనికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X