#NTR31 మూడు దేశాలను గడగడలాడించిన వ్యక్తి కథతో ఎన్టీఆర్.. నిజమైతే పూనకాలే

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర పార్ట్ -1 షూటింగ్‌ను వేగంగా కంప్లీట్ చేస్తోన్న ఆయన తాజాగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో కమిటైన మూవీకి కొబ్బరికాయ కొట్టారు. #NTR31 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ క్రేజీ మూవీ 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనా. కేజీఎఫ్, సలార్‌ల సక్సెస్‌తో మంచి జోరుమీదున్న ప్రశాంత్ నీల్.. మ్యాన్ ఆఫ్ మాసెస్‌ ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తారోనని అభిమానులు ఎగ్జయిట్ అవుతున్నారు.

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. అయితే #NTR31ని 1969లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారని ఓ వార్త వైరల్ అవుతోంది. ఆ సమయంలో భారత్, చైనా, భూటాన్ సరిహద్దుల్లో గోల్డెన్ ట్రయాంగిల్‌గా పేర్కొనే ఏరియాలో డ్రగ్స్ స్మగ్లింగ్, ఈల్లీగల్ దందాలు ఓ రేంజ్‌లో జరిగేవట. ఖున్ సా అనే వ్యక్తి కనుసన్నల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ , ఇతర సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరిగేవట. పెద్ద మొత్తంలో ఓపియంను ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేస్తుండటంతో ఇతనిని మయన్మార్‌లో ఓపియం కింగ్‌గా అభివర్ణించేవారు. 1976 నుంచి 1996 మధ్య ఖున్ సా తన కార్యకలాపాలు యథేచ్చగా నిర్వహించేవాడట.

Jr NTR To Play Drug Lord Khun Sa In Prashanth neel movie

తనకు ఎదురే లేదనుకున్న దశలో అమెరికన్ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఖున్ సా, అతని విదేశీ బ్రోకర్ల మధ్య సంబంధాన్ని బట్టబయలు చేసి, అతని చీకటి సామ్రాజ్యాన్ని పెకిలించే చర్యలు చేపట్టడంతో 1996లో ఖున్ సా బర్మా ప్రభుత్వానికి లొంగిపోయాడు. అనంతరం తన ప్రైవేట్ సైన్యాన్ని రద్దు చేసి.. డబ్బు, తన ఉంపుడుగత్తెలతో కలిసి యాంగోన్‌కు వెళ్లిపోయాడు. ఖున్ సా తన చీకటి పనులకు ఫుల్ స్టాప్ పెట్టినప్పటికీ.. అతని మనుషుల్లోని కొందరు లొంగిపోవడానికి నిరాకరించి, ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నాయి.

అయితే ఖున్ సా మాత్రం చట్టబద్ధంగా మైనింగ్, నిర్మాణ ప్రాజెక్ట్‌లతో పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డాడు. 2007లో 73 ఏళ్ల వయసులో ఖున్ సా కన్నుమూశాడు. అయితే అతని మరణానికి కారణం ఏంటనేది నేటికీ మిస్టరీయే. కొందరు మాత్రం డయాబెటిస్, బీపీ, గుండె జబ్బు కారణంగానే ఖున్ సా చనిపోయినట్లు చెబుతారు. తాను చనిపోతే తన మృతదేహాన్ని షాన్ రాష్ట్రంలో ఖననం చేయొద్దని, అలా చేస్తే తన సమాధిని ధ్వంసం చేస్తారని ఖున్ సా తన కుటుంబ సభ్యులతో ముందే చెప్పాడట.

Jr NTR To Play Drug Lord Khun Sa In Prashanth neel movie

నేర సామ్రాజ్యానికి అధిపతిగానే కాదు.. ప్రజల చేత మన్ననలు సైతం అతను అందుకున్నాడు. ఖున్ సా తన అక్రమ సంపాదనను జనం కోసం ఖర్చు చేశాడట. థాయ్‌లాండ్‌లోని థోడ్ థాయ్ పట్టణంలో విశాలమైన రహదారులు, మొదటి పాఠశాలను కట్టించాడట. చైనీస్ వైద్య సిబ్బందితో కూడిన 60 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశాడట. ఓ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌కు కూడా శ్రీకారం చుట్టి పనులు మొదలుపెట్టగా.. ఖున్ సా మరణం తర్వాత దాని నిర్మాణం ఆగిపోయిందని స్థానికులు చెబుతారు.

విదేశీ పర్యాటకుల కోసం 18 హోల్ గోల్ఫ్ కోర్స్‌, ఫంక్షనల్ వాటర్, ఎలక్ట్రికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేశాడని తెలిపారు. మొత్తంగా చూస్తే ఖున్ సాలో రాబిన్ హుడ్ లక్షణాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. అతని జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెలుగు నెటివిటీకి అనుగుణంగా మార్చి ప్రశాంత్ నీల్‌.. ఎన్టీఆర్‌తో సినిమా తీయనున్నారని టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X