ఎన్టీఆర్ కొత్త సినిమాపై సర్‌ప్రైజింగ్ అప్‌డేట్: అతి భయానకమైన పాత్రలో నందమూరి హీరో.!
రూపం, నటనలోనే కాకుండా వ్యక్తిత్వంలోనూ తాత నందమూరి తారక రామారావును గుర్తు చేస్తుంటాడు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. బడా ఫ్యామిలీకి చెందిన వాడే అయినా... సాధారణంగా సినిమాల్లోకి ప్రవేశించిన అతడు... తక్కువ సమయంలోనే అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శించి స్టార్ హీరో అయిపోయాడు. ఇక, ఈ మధ్య ఫుల్ ఫామ్‌లో ఉన్న తారక్... వరుసగా భారీ చిత్రాలను లైన్‌లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు మరో పాన్ ఇండియా మూవీలో నటించబోతున్నాడు. తాజాగా దాని గురించి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

టాలీవుడ్ ఆల్‌రౌండర్.. డబుల్ హ్యాట్రిక్ బాట
దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, సింగింగ్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు. ఇటీవలి కాలంలో ‘టెంపర్', ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత' వంటి వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్‌కు చేరువయ్యాడు.

చరిత్ర సృష్టించేందుకు మెగా హీరోతో కలిశాడు
వరుస విజయాలతో దూసుకుపోతోన్న జూనియర్ ఎన్టీఆర్... ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR ‘రౌద్రం రణం రుధిరం)లో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అతడితో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. పోరాట యోధులు అల్లూరి, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రూపొందే ఈ మూవీ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

హిట్ ఇచ్చిన దర్శకుడితో మరో భారీ మూవీ
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అరవింద సమేత.. వీరరాఘవ'తో జూనియర్ ఎన్టీఆర్ భారీ విజయాన్ని అందుకున్నాడు. దీని తర్వాత వీళ్లిద్దరి కాంబోలో మరో మూవీ రాబోతుంది. RRR తర్వాత ప్రారంభం అయ్యే ఈ చిత్రానికి ‘అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కల్యాణ్ రామ్, రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాతలు.

లేటైనా మిస్సైల్‌లా దూసుకు రావడం పక్కా
ఇంత మంది దర్శకులు పేర్లు బయటకు వచ్చినా ఏ ప్రాజెక్టు విషయంలోనూ ఎటువంటి స్పందన రాలేదు. కానీ, ప్రశాంత్ నీల్‌తో తారక్ సినిమా ఉంటుందని మాత్రం ఆ మధ్య దాదాపుగా ఖాయమైంది. అంతేకాదు, దీనికి ‘మిస్సైల్' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఇటీవలే కథా చర్చలు కూడా జరిగాయని సమాచారం.

తన సత్తా దేశం మొత్తం చూపించేలా వ్యూహం
ఫామ్‌లో ఉన్నప్పుడే తన సత్తాను దేశ వ్యాప్తంగా చూపించాలని తారక్ భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రశాంత్‌తో చేయబోయే సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్‌తో తెరకెక్కించనున్నారట. అంతేకాదు, దీనికి దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటి నుంచే ప్లాన్లు చేస్తుందని టాక్.
Recommended Video

అతి భయానకమైన పాత్రలో నందమూరి హీరో.!
ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం... ఈ సినిమా బయో వార్ నేపథ్యంతో తెరకెక్కనుందట. ఇందులో తారక్ ప్రపంచం అంతటినీ గడగడలాడించే భయంకరమైన మాఫియా డాన్‌లా కనిపించనున్నాడట. దీని కోసం అతడి మేకోవర్ మొత్తం మార్చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











