ఎన్టీఆర్‌ను అలా ఆడుకునే దమ్ము ఆ ఒక్కడికే ఉంది... (వైరల్ వీడియో)

By Bojja Kumar

Recommended Video

ఎన్టీఆర్‌ను అలా ఆడుకునే దమ్ము ఆ ఒక్కడికే ఉంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తారక్ ముఖం మీద ఎడతెరిపి లేకుండా పంచ్‌లు గుప్పిస్తుండటం... తారక్ ఆ దెబ్బలను ప్రేమతో భరించడం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇదేదో సినిమా సీన్ అనుకుంటే పొరపాటే. స్వయంగా ఎన్టీఆర్ ఇంట్లో చోటు చేసుకున్న ఘటన ఇది. ఆ పంచ్‌లు గుప్పిస్తున్నది ఎవరో కాదు మన హీరోగారి ముద్దుల కుమారుడు అభయ్ రామ్. నాన్నతో ఆడుకుంటూ ఈ బుడ్డోడు తన బాక్సింగ్ సరదా తీర్చుకున్నాడు. దీనిపి ఎన్టీఆర్ ఓ ఆసక్తికర కామెంట్ పెట్టారు.

కొడుకు కోసం పంచింగ్ బ్యాగ్‌గా మారిపోయాను

కొడుకు కోసం నేను పంచింగ్ బ్యాగ్‌గా మారిపోయాను... మా వాడు కరాటే కిడ్ అంటూ కామెంట్ పెట్టారు. ఈ పోస్టు ద్వారా ప్రతి ఒక్కరూ తమ పిల్లలతో ఆడుకునే సమయంలో ఇలా పంచింగ్ బ్యాగ్‌గా మారిపోతారు అని గుర్తు చేశాడు.

ఎన్టీఆర్‌ను అలా ఆడుకునే దమ్ము ఆ ఒక్కడికే ఉంది

ఎన్టీఆర్‌ను అలా ఆడుకునే దమ్ము ఆ ఒక్కడికే ఉంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్... తెరపై విలన్లను ఓ ఆట ఆడుకుంటూ ఉంటారు. అయితే ఆయనతో రియల్ లైఫ్‌లో ఇలా ఆడుకునే దమ్ము అభయ్ రామ్ కు మాత్రమే ఉందని.... అభయ్ పెద్దయిన తర్వాత యాక్షన్ హీరోగా అవతరిస్తాడని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

అరవింద సమేత

అరవింద సమేత

ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం తారక్‌ ‘అరవింద సమేత' మూవీలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. ఈ చిత్రం దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రాజమౌళితో భారీ మూవీ

రాజమౌళితో భారీ మూవీ

‘అరవింద సమేత' తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్‌గా రాజమౌళి భారీ మూవీ ప్లాన్ చేస్తున్నారు. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కే ఈ మూవీ తెలుగు సినిమా చరిత్రలోనే బాహుబలి తర్వాత అతిపెద్ద ప్రాజెక్ట్ అని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X