రాజకీయాలతో వ్యాపారం చేయనున్న తారక్: పక్కా ప్లాన్‌తోనే పొలిటికల్ ఎంట్రీ
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'టెంపర్' సినిమా నుంచి 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఏకంగా ఐదు విజయాలను తన ఖాతాలో వేసుకొని జోష్ మీదున్న ఈ స్టార్ హీరో.. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'RRR' అనే మూవీ చేస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు తారక్.
'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. RRR తర్వాత పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో రూపొందబోతుందని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కథ ఇదేనంటూ ఓ స్టోరీ లైన్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఎన్టీఆర్ వ్యాపారవేత్తగా కనిపిస్తాడట. ఆ తర్వాత రాజకీయాల గురించి తెలుసుకున్న అతడు.. డబ్బు సంపాదించడానికి అదే సరైన మార్గం అని భావిస్తాడట. ఈ క్రమంలోనే పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. అలా రాజకీయాల్లోకి ప్రవేశించిన తారక్.. ఆ తర్వాత డబ్బు సంపాదించాడా? లేకపోతే సమాజానికి ఉపయోగపడే పనులు చేశాడా? అన్నది సినిమాలో చూపించబోతున్నాడని ప్రచారం అవుతోంది. అందుకే ఈ సినిమాకు పొలిటికల్ టచ్ వచ్చేలా టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











