జూనియర్ ఎన్టీఆర్ కుడి చేతికి తీవ్ర గాయం.. వెంటనే సర్జరీ.. అసలు ఏమైందంటే?

టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరూ వరుసగా సర్జరీల బాట పట్టడం సంచలనంగా మారింది. ముందు చిరంజీవి మణికట్టుకు సర్జరీ జరగగా కొద్ది రోజుల క్రితం బాలకృష్ణ కుడి భుజానికి సర్జరీ జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ కుడి అర చేతికి సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. అసలు ఎన్టీఆర్ కి ఏమైంది? కుడి చేతికి ఎందుకు సర్జరీ చేశారు? అనే వివరాల్లోకి వెళితే

చిరంజీవికి అలా

చిరంజీవికి అలా

వరుసగా టాలీవుడ్ హీరోల కుడిచేతికి సర్జరీ జరుగుతుండడం ఆసక్తికరంగా మారింది. ముందుగా మెగాస్టార్ చిరంజీవి కుడి మణికట్టుకు సర్జరీ జరిగింది. ఆయన కుడి చేత్తో ఏ పని చేయాలన్నా చేయలేకపోవడం చేయి తిమ్మిరి తిమ్మిరిగా అనిపించడంతో డాక్టర్లను సంప్రదించగా ఆయన కుడి చేతికి సర్జరీ అవసరం అని చెప్పి మణికట్టు దగ్గర సుమారు 40 నిమిషాల పాటు సర్జరీ చేసినట్టుగా మెగాస్టార్ స్వయంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కారణంగా రెస్టు తీసుకుంటున్నా అని చెబుతూ ఆయన దాదాపు పదిహేను రోజులపాటు ఇంటికే పరిమితమయ్యారు.

బాలకృష్ణకు అలా

బాలకృష్ణకు అలా

ఇక ఆ తర్వాత బాలకృష్ణ కూడా కుడి భుజం నొప్పితో బాధపడుతూ డాక్టర్లను సంప్రదించగా ఆయన కుడి భుజానికి కూడా సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పడంతో ఆయన కేర్ హాస్పిటల్ లో జాయిన్ భుజానికి సర్జరీ చేయించుకున్నారు. నిజానికి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ సమయంలో ఆయన కుడి భుజానికి గాయం కాగా అప్పటి నుంచి అదే సమస్య ఆయనని బాధ పెడుతుంది. ఇక తాజాగా బాధ ఎక్కువ కావడంతో సర్జరీ కూడా చేయించుకున్నారు.

వ్యాయామం చేస్తున్న సమయంలో

వ్యాయామం చేస్తున్న సమయంలో

తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ కుడిచేతికి కూడా సర్జరీ జరిగింది.. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసి ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్స్ షూటింగ్ కూడా పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే కొరటాల శివ సినిమా కోసం బాడీ కొంచెం పెంచాల్సి రావడంతో ఆయన ఇంట్లోనే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా కసరత్తు చేస్తున్న సమయంలో ఆయన కుడి చేతి వేలు ఒకటి విరిగిపోయిందని తెలుస్తోంది.

ఆ ఫోటో షేర్ చేయడంతో

ఆ ఫోటో షేర్ చేయడంతో

వేలు విరగడంతో ఎన్టీఆర్ వైద్యులను సంప్రదించడంతో ఒక చిన్నపాటి సర్జరీ చేయాలని వైద్యులు సూచించగా ఎన్టీఆర్ సర్జరీ చేయించుకున్నట్లు గా తెలుస్తోంది. అయితే ఈ విషయం ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించ లేదు కానీ దీపావళి సందర్భంగా తన కుమారులతో కలిసి ఒక ఫోటో ని ఎన్టీఆర్ షేర్ చేశాడు. తన కుమారులు భార్గవ్ రామ్, అభయ్ రామ్ ఇద్దరితో కలిసి ఉన్న ఎన్టీఆర్ ఫోటోలో ఆయన చేతికి బ్యాండేజి లాగా కనిపించడంతో అభిమానులు అందరూ కంగారు పడ్డారు.

Recommended Video

KGF Chapter 2 Vs RRR : Rajamouli రంగంలోకి దిగితే Yash రికార్డ్ గల్లంతే!! || Filmibeat Telugu
ఎన్టీఆర్ చేతికి సర్జరీ

ఎన్టీఆర్ చేతికి సర్జరీ

అయితే ఈ విషయం మీద ఆరా తీయడం తోనే ఎన్టీఆర్ చేతికి సర్జరీ జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చింది. వ్యాయామం చేస్తున్న సమయంలో విరగడంతో సర్జరీ చేయించారని అయితే కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదని అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ సహా కొరటాల శివ సినిమా షూటింగ్ లో కూడా ఎన్టీఆర్ త్వరలోనే పాల్గొంటారని కొద్ది రోజుల పాటు ఆయన రెస్ట్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది. మొత్తం మీద టాలీవుడ్ హీరోల కుడి చేతికి సర్జరీల వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X