Devara కోసం ఎన్టీఆర్ భారీ రిస్క్.. ఇండియాలోనే ఏ హీరో చేయని విధంగా ట్రైనింగ్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఓ ఎమోషన్ లాంటిది. తాత నందమూరి తారక రామారావు పోలికలతో సినిమాల్లోకి వచ్చిన అతడు.. సుదీర్ఘ కాలంగా తనదైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, సాంగ్స్ ఇలా అన్నింట్లో రాణిస్తూ దూసుకుపోతోన్నాడు. ఫలితంగా తన రేంజ్‌ను క్రమంగా పెంచుకుంటోన్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు 'దేవర' చేస్తోన్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'దేవర'. హై రేంజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో రాబోతుంది. దీంతో ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీస్తున్నారు. ఫలితంగా ఈ చిత్రంపై ఆసక్తి పెరుగుతూనే ఉంది.

కొరటాల - ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న 'దేవర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చిలోనే స్టార్ట్ చేశారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన పలు భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే మరో దాన్ని కూడా మొదలు పెట్టబోతున్నట్లు తాజాగా తెలిసింది. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
కోస్టల్ బ్యాగ్‌డ్రాప్ స్టోరీతో రాబోతున్న 'దేవర' మూవీని హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో తెరకెక్కిస్తోన్నారు. ఇందుకోసం విదేశాలకు చెందిన స్టంట్ కొరియోగ్రాఫర్లను తీసుకు వచ్చారు. ముఖ్యంగా ఈ మూవీలోని అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం ముంబై నుంచి కొందరిని తీసుకు వచ్చారు. ఇప్పుడు వీళ్లతోనే ఈ సీన్స్‌ను షూట్ చేయబోతున్నట్లు తెలిసింది.

'దేవర' మూవీలో అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌ను హై రేంజ్‌లో ప్లాన్ చేసినట్లు ముందే చెప్పుకున్నాం. ఈ సీన్స్ కోసం ఎన్టీఆర్ ఇప్పుడు నీటి అడుగున ఎలా ఉండాలి అన్న దానిపై శిక్షణ తీసుకుంటున్నాడట. ముంబై నుంచి వచ్చిన స్పెషల్ టీమ్ పర్యవేక్షణలోనే అతడు ఈ రిస్క్ చేస్తున్నాడని తెలిసింది. ఇలా గతంలో ఏ ఇండియన్ హీరో కూడా చేయలేదని టాక్.

ఇదిలా ఉండగా.. 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











