‘మీరు సైలెంట్‌గా ఉంటారా? నన్ను వెళ్లిపోమంటారా?' ఫ్యాన్స్ తీరుపై ఎన్టీఆర్ సీరియస్

By Manoj Kumar P

జూనియర్ ఎన్టీఆర్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో ఒకడు. రూపంలో, నటనలో తాత నందమూరి తారక రామారావును గుర్తు చేసేలా ఉండే ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం దూకుడు మీద ఉన్నాడు. కొన్నేళ్లుగా వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలాఉండగా.. ఫ్యాన్స్ అంటే ఎంతగానో గౌరవించే తారక్.. వాళ్ల తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. తాజాగా జరిగిన ఈ పరిణామం హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఎన్టీఆర్ ఎందుకలా సీరియస్ అయ్యాడు.? పూర్తి వివరాల్లోకి వెళితే...

విప్లవ వీరుడి పాత్రను పోషిస్తున్నాడు

విప్లవ వీరుడి పాత్రను పోషిస్తున్నాడు

ప్రస్తుతం తారక్.. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి RRR అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు తెలంగాణలోని విప్లవ వీరుడు కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్నాడు. ఇందుకోసం ఈ నందమూరి హీరో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా మంచి ఫిజిక్ మెయింటైన్ చేసేందుకు రోజూ గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు.

అన్నకు సాయం చేయాలని వచ్చాడు

అన్నకు సాయం చేయాలని వచ్చాడు

నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా'. ఓ వైపు భారీ సినిమాలు విడుదల అవుతుండగా.. కల్యాణ్ రామ్ వాళ్లకు పోటీగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో దిగుతున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు బెస్ట్ విసెష్ చెప్పాడు.

వాళ్ల వల్ల మాట్లాడని కల్యాణ్ రామ్

వాళ్ల వల్ల మాట్లాడని కల్యాణ్ రామ్

హైదరాబాద్‌లో జరిగిన ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. ఈ వేడుక ఆసాంతం అరుపులు, కేకలతో సందడి చేసిన ఫ్యాన్స్.. చివర్లో మాత్రం చిరాకు తెప్పించారు. ఈ సినిమా గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడతానని గతంలో చెప్పిన కల్యాణ్ రామ్.. ఫ్యాన్స్ చేస్తున్న గోలకు ఎంతో సేపు మాట్లాడలేదు.

ఫ్యాన్స్ తీరుపై ఎన్టీఆర్ సీరియస్

ఫ్యాన్స్ తీరుపై ఎన్టీఆర్ సీరియస్

కల్యాణ్ రామ్‌ను మాట్లాడనివ్వని ఫ్యాన్స్‌పై ఎన్టీఆర్ సీరియస్ అయ్యాడు. ‘మీరు సైలెంట్‌గా ఉంటారా.? నన్ను వెళ్లిపోమంటారా?' అంటూ ఫైర్ అయ్యాడు. దీంతో వాళ్లు కాసేపు నెమ్మదించారు. కొద్ది సేపటి తర్వాత మళ్లీ వాళ్లంతా గోల చేయడంతో తారక్ కాసేపు మాత్రమే మాట్లాడి వెళ్లిపోయాడు. నందమూరి ఫ్యాన్స్ చేసిన పని ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.

కోపంతో ఉన్నా ఫ్యాన్స్ మంచే కోరాడు

కోపంతో ఉన్నా ఫ్యాన్స్ మంచే కోరాడు

తనను, తన అన్నను మాట్లాడనివ్వకపోవడంతో కోపంతో కనిపించిన తారక్.. చివర్లో ఎప్పుడూ చెప్పే విధంగా ప్రసంగించాడు. ‘మీరు ఇక్కడి నుంచి క్షేమంగా ఇంటికి వెళ్లండి. మీకు మాకంటే ముందు ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్లంతా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అందరూ తమ తమ ఇళ్లకు జాగ్రత్తగా వెళ్లండి' అంటూ ఫ్యాన్స్ క్షేమం కోరుకున్నాడు తారక్.

తారక్ తీరుతో అందరూ షాక్

తారక్ తీరుతో అందరూ షాక్

జూనియర్ ఎన్టీఆర్‌కు వివాదరహితుడిగా పేరుంది. రాజకీయాల్లో పాల్గొన్న సమయంలోనూ ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడలేదు. పైగా అందరు హీరోలతో స్నేహంగా ఉంటాడు. మరీ ముఖ్యంగా ఎప్పుడూ ఫ్యాన్స్ మంచి కోరుకుంటాడు. అలాంటిది.. ఈ ఫంక్షన్‌లో సీరియస్ అవడం చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. అదే సమయంలో ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

ఎంత మంచివాడవురా గురించి

ఎంత మంచివాడవురా గురించి

ప్రస్తుతం కల్యాణ్ రామ్ - వేగేశ్న సతీష్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా'. మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ ఇండియా (ప్రైవేట్) లిమిటెడ్ అధినేత ఉమేష్ గుప్త సమర్పణలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X