NTR 30 సినిమాకు మరో కొత్త సమస్య.. మరింత ఆలస్యంగా షూటింగ్?
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో రాబోతున్న సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో అద్భుతంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా ఫ్యాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సోలోగా బిగ్ సక్సెస్ అందుకోవాలని ఎన్టీఆర్ కూడా ఆలోచిస్తున్నాడు. RRR సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అటు నార్త్ ఇండస్ట్రీలో కూడా ఈ కాంబినేషన్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈపాటికే సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది. అసలు సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమాను విడుదల చేయాలి అని చాలా ఆలోచించారు కానీ పరిస్థితిలు అందుకు భిన్నంగా ఏర్పడుతున్నాయి.
ఆచార్య సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో కొరటాల శివ స్క్రిప్ట్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎన్టీఆర్ కూడా ఏమాత్రం రిస్కు తీసుకోకుండా ప్రతి సన్నివేశం కూడా హైలెట్ గా ఉండాలి అని కొరటాల శివకు సజెషన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే హీరోయిన్స్ విషయంలో మాత్రం ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అసలైతే మొదట ఆలియా భట్ ఫిక్స్ అయినట్లు ఒక టాక్ అయితే వచ్చింది. ఆలియా భట్ కూడా ఆ విషయంపై స్పందించింది కానీ ఆమెకు తర్వాత మ్యారేజ్ జరగడం వెంటనే ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ ఇవ్వడంతో ఎన్టీఆర్ తో నటించడం లేదని ఒక క్లారిటీ వచ్చేసింది.

ఆ తరువాత కియరా అద్వానీ, పరిణితి చోప్రా ఇలా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా ఎవరు ఫైనల్ కాలేదు. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ హీరోయిన్ ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. అలాగే సినిమాలో సెకండ్ హీరోయిన్ కూడా అవసరం ఉంది. కృతి శెట్టి లాంటి హీరోయిన్స్ ను తీసుకోవాలని చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కేవలం హీరోయిన్ ను సెలెక్ట్ చేయకపోవడం వలన ప్రస్తుతం షూటింగ్ ఇంకొంత ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. అసలైతే ఆగస్టు లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు షూటింగ్ సెప్టెంబరికి షిఫ్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక సినిమా వచ్చే సమ్మర్ కు రావడం కష్టమే అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











