Devara: దేవర కోసం ఎవరూ వెళ్లని ప్లేస్‌కు ఎన్టీఆర్.. ఇండియాలోనే ఫస్ట్ హీరోగా రికార్డు
ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ టాలీవుడ్‌లోనే ఏ హీరోకూ సాధ్యం కాని విధంగా దూసుకుపోతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు RRR సినిమాతో అతడి రేంజ్ గ్లోబల్ లెవెల్‌కు చేరింది. దీంతో మరింత ఉత్సాహంతో కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఇలా ఇప్పుడు ఎన్టీఆర్ 'దేవర' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న 'దేవర' మూవీని బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. దీంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని తీస్తున్నారు. దీనికితోడు ఇటీవలే వచ్చిన గ్లింప్స్ వీడియోతో 'దేవర' చిత్రంపై హైప్ మరింతగా పెరిగిపోయింది.

హై రేంజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'దేవర' మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందులో మొదటి భాగాన్ని ఈ ఏడాదిలోనే ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. ఇలా ఇప్పటి వరకూ ఎన్నో షెడ్యూళ్లను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. మొత్తంగా 85 శాతం టాకీ పార్టును ఫినీష్ చేసేశారు.
సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'దేవర' మూవీని ఏప్రిల్ నుంచి వాయిదా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ గురించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ మూవీని ప్రమోట్ చేసేందుకు ఎన్టీఆర్ 2 నెలలు కేటాయించాడని తెలిసింది.

అంతేకాదు, 'దేవర' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ దేశ వ్యాప్తంగా 27 ప్రదేశాల్లో ఈవెంట్లు లేదా ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నాడని తెలిసింది. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకూ ఏ హీరో వెళ్లని ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఎన్టీఆర్ వెళ్తున్నాడని సమాచారం. అదే జరిగితే ఆ రాష్ట్రాలకు వెళ్లి ప్రమోట్ చేసిన తొలి హీరోగా అతడు రికార్డు సాధించినట్లు అవుతుంది.
ఇదిలా ఉండగా.. 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











