twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక నుంచి నేను చూసుకుంటా... తాత సమాధి సాక్షిగా ఎన్టీఆర్ సంచలన నిర్ణయం!

    |

    గత కొన్నేళ్లుగా యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తాతగారి జయంతి రోజున ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడూ లేని విధంగా ఈ సారి తీవ్ర అసంతృప్తికి, ఆగ్రహానికి గురయ్యారు. అందుకు కారణం మంగళవారం ఉదయం సమాధి వద్దకు రాగానే అక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేక పోవడమే. ప్రతి ఏటా అలంకరణతో వెలిగిపోయే ఎన్టీఆర్ ఘాట్ ఈ సారి ఎవరూ పట్టించుకోక నిర్లక్ష్యానికి గురవ్వడం చూసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు చిన్నరామయ్య. ఈ పరిస్థితికి ఎవరిని నిందించాలో తెలియక తనలో తానే కుమిలిపోయాడు. అప్పటికప్పుడు తన వద్ద ఉన్న పూల దండలు, బొకేలు విచ్చి గులాబీలు సమాధిపై అలంకరించే ప్రయత్నం చేశారు.

    తాత సమాధి సాక్షిగా ఎన్టీఆర్ నిర్ణయం

    తాత సమాధి సాక్షిగా ఎన్టీఆర్ నిర్ణయం

    ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి రోజున ఘాట్ అలంకరణ బాధ్యతలు... రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ చూసుకుంటుంది. అయితే ఈ సారి ఎన్నికల్లో ఓడి పోవడంతో పార్టీ వారు నిర్లక్ష్యం వహించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు చూసి విస్తుపోయిన చిన్న రామయ్య తాత సమాధి సాక్షిగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ఇక నుంచి ఆ బాధ్యతలు నేనే చూసుకుంటా

    ఇక నుంచి ఆ బాధ్యతలు నేనే చూసుకుంటా

    ఇక నుంచి ఎన్టీఆర్ ఘాట్ బాధ్యతలు తానే చూసుకుంటానని.... ఈ సందర్భంగా యంగ్ టైగర్ తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి అవమానకర పరిస్థితి చూసి చిన్న రామయ్య చాలా బాధ పడ్డారని, ఈ పరిస్థితికి ఎవరినీ తప్పుపట్టకుండా ఇకపై అలా జరుగకుండా తానే బాధ్యత తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట.

    రాజకీయ నాయకులు అంతేనా?

    రాజకీయ నాయకులు అంతేనా?

    ఓడలో ఉన్నంత సేపు ఓడ మల్లయ్య... ఓడ దిగాక బొడి మల్లయ్య అనే సామెతను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకాలం రామారావు ఫోటో పెట్టుకుని ఓట్లు దండుకుంటూ, అధికారంలోకి వచ్చిన పార్టీ అధిష్టానం... ఇపుడు ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

    ఇపుడు ఎన్టీఆర్ ఘాట్, నెక్ట్స్...

    ఇపుడు ఎన్టీఆర్ ఘాట్, నెక్ట్స్...

    ఎన్టీఆర్ ఘాట్ బాధ్యతలు తారక్ తన ఆధీనంలోకి తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తాతయ్య సమాధి మాధిరిగానే... తాతయ్య స్థాపించిన పార్టీని కూడా ఎన్టీఆర్ తన ఆధీనంలోకి తీసుకోవాలని, అద్వాన్నస్థితికి చేరుకున్న పార్టీకి మళ్లీ జీవం పోసే బాధ్యతలు చేపట్టాలని పలువురు కోరుంటున్నారు.

    యంగ్ టైగర్ ఉద్దేశ్యం ఏమిటో?

    యంగ్ టైగర్ ఉద్దేశ్యం ఏమిటో?

    గతంలోనే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని, తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చూసుకోవాలని అభిమానులు కోరారు. అయితే తనకు ప్రస్తుతం రాజకీయాలు చేసేంత వయసు, అనుభవం లేదని.... ప్రస్తుతం తాను ఉన్న సినిమా రంగంలోనే సాధించాల్సింది చాలా ఉంది అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగు దేశం పార్టీలో మారిన పరిణామాలతో యంగ్ టైగర్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి.

    English summary
    NTR 96th birth anniversary, NTR Jr and Kalyan Ram at the NTR Ghat, Jr NTR and Kalyan Ram, Jr NTR, Kalyan Ram, NTR Jr and Kalyan Ram pay tribute to NTR, NTR goes hand in hand with brother Kalyanram, Jr NTR and Kalyan Ram at NTR Ghat
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X