‘RRR’ కోసం కండలు కరిగిస్తున్న తారక్.. ఆ సీన్ కోసమేనా..?

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'టెంపర్' నుంచి ఎన్నో విజయాలను అందుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి 'RRR'లో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు.. అందునా బడా డైరెక్టర్ ఉండడంతో ఈ కాంబినేషన్ తెలుగు సినీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో తారక్ తెలంగాణలోనే పేరు గాంచిన పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఇందుకోసం ఇప్పటికే గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అలాగే తన పాత్ర కోసం కత్తిసాము, కర్రసాము కూడా నేర్చుకున్నాడని ప్రచారం జరుగుతోంది. దీనికితోడు, తన శరీరాకృతిని మెరుగుపరుచుకోవడం కోసం తారక్ ఎన్నో కసరత్తులు చేస్తున్నాడు.

Jr Ntr working out For ‘RRR’

ఇందుకోసం 'అరవింద సమేత' సినిమా సమయంలో తన ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పని చేసిన లాయిడ్‌ స్టీవెన్‌తో పని చేస్తున్నాడు. కొద్దిరోజులుగా ఆయన పర్యవేక్షణలో ఈ నందమూరి హీరో ఎన్నో కసరత్తులు చేస్తున్నాడు. ఈ మేరకు లాయిడ్‌ స్టీవెన్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ ఫొటోను షేర్ చేశాడు. 'మా నుంచి ఇవ్వగలిగినదంతా ఇస్తున్నాం' అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఈ ఫొటోలో తారక్ తన తొడ కండరాలను దృఢంగా చేసుకునే కసరత్తు చేస్తూ కనిపిస్తున్నాడు.

తారక్ ఇంతగా కష్టపడడానికి కారణం ఈ సినిమాలోని కొమరం భీం ఇంట్రడక్షన్ సీన్‌ కోసమేనన్న టాక్ వినిపిస్తోంది. తారక్ ఎంట్రన్స్ గ్రాండ్‌గా ఉండాలన్న ఉద్దేశ్యంతో రాజమౌళి సరికొత్తగా ఆలోచించారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు ఈ పిక్ బలం చేకూర్చేదిగా ఉంది. దాని ప్రకారం ఈ సీన్ కోసం రూ. 15 కోట్లు ఖర్చు చేస్తున్నారట. భారీ తారాగణంతో ఈ సీన్ తెరకెక్కించారని తెలిసింది. దీనికి సంబంధించిన షూటింగ్ ఇటీవల హైదరాబాద్ శివారు ప్రాంతంలో వేసిన ప్రత్యేక సెట్‌లో చేశారని టాక్.

ఈ పిక్ విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని తారక్ అభిమానులు తెగ షేర్లు చేస్తున్నారు. 'RRR' కోసం తారక్ ఎంత కష్టపడుతున్నాడో ఈ పిక్ చూస్తూ అర్థమవుతోంది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి 'RRR' షూటింగ్ ప్రారంభానికి ముందు లాయిడ్‌ స్టీవెన్‌.. రాజమౌళిని కలిశాడు. ఆ సమయంలో లెజెండరీ దర్శకుడిని కలిసినందుకు ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 జూలై 30న విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X