బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్ కేక.. యంగ్ టైగర్ చేతికి మరో క్రేజీ ప్రొడక్ట్
వెండి తెరపై దుమ్మురేపుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో మరో సెన్సేషన్ చేరింది. సినిమాలతో పాటు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నవరతన్ హెయిర్ ఆయిల్, సెలక్ట్ మొబైల్స్, యాప్పీ ఫిజ్ లాంటి ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా బ్రాండ్ అంబాసిడర్‌గానూ దూసుకెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ చేతికి మరో క్రేజీ ప్రొడక్స్ దొరికింది. ఓట్టో అనే దుస్తుల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నారు. ఈ విషయాన్ని ఓట్టో కంపెనీ వెల్లడించాయి.
ఎన్టీఆర్ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి అంగీకరించడంపై ఓట్టో కంపెనీ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఎన్టీఆర్‌తో తమ ఉత్పత్తులకు మంచి ప్రచారం జరుగుతుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ప్రచార కర్తగా ఉన్నందుకు కంపెనీ భారీగా రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, అరవింద సమేత చిత్రంతో మంచి హిట్టును ఖాతాలో వేసుకొన్న తారక్.. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించే RRR చిత్రంలో నటిస్తున్నారు. RRR చిత్రం హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని ఉత్తర భారతంలో కొంత షూటింగ్ జరుపుకొన్నది.
కాగా రాంచరణ్ గాయం కారణంగా RRR చిత్రం వాయిదా పడింది. అప్పటి నుంచి RRR సినిమాకు అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో RRR షూటింగ్ మరికొన్న రోజులు వాయిదా పడింది.
RRR చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనిపించనున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్డర్ జోన్స్ జంటగా నటించాల్సింది. అయితే కుటుంబ కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్ కోసం రాజమౌళి వెతుకుతున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











