Devara ట్యాగ్ మార్చుకున్న జూనియర్ ఎన్టీఆర్... కొత్త పేరేంటో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఇకపై జూనియర్ ఎన్టీఆర్ ను యంగ్ టైగర్ అని పిలవొద్దు. ఎందుకంటే ఆయన తన ట్యాగ్ మార్చుకున్నాడు. ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రానుంది. ఈ సినిమాతో ఆయన ట్యాగ్ మారిపోయింది. ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ చూస్తే.. అందులో ఆయన ట్యాగ్ యంగ్ టైగర్ కాకుండా పవర్ ఫుల్ ట్యాగ్ ను పెట్టారు. ఇంతకీ ఆ ట్యాగ్ ఏంటి.. ఎందుకు మార్చురు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి సినిమాతో వస్తాడో అని ఫ్యాన్స్ అంత ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దేవర అనే పవర్ ఫుల్ టైటిల్, అండ్ సబ్జెక్టుతో వస్తున్నాడు.

Junior hanged his tag Young Tiger to Man of Masses for the Devara Movie Full Details Here

ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దేవర సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ... దేవర సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక తాజాగా దేవర మూవీ గ్లింప్స్‌ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ గ్లింప్స్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసేసింది.

హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దేవర సినిమా తెరకెక్కుతోంది. దేవర మూవీలో తారక్ ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నరని గ్లింప్స్ చూశాక అర్థం అయిపోయింది. ఇక తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌ తో తారక్ ఫ్యాన్స్ మరింత ఖుషి అవుతున్నారు. ఈ వీడియోలో తారక్ చెప్పిన డైలాగ్, లుక్ ఆకట్టుకోగా... ఐదు భాషల గ్లింప్స్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. గ్లింప్స్ లో అనిరుధ్ ఇంగ్లీషు పాటతో మొదలు కావడం ఆసక్తి కలిగించింది.

Junior hanged his tag Young Tiger to Man of Masses for the Devara Movie Full Details Here

ఇక ఇదిలా ఉంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్..దేవర సినిమాతో తన ట్యాగ్ ను మార్చుకున్నాడు. దేవర సినిమా టైటిల్ లో ఎన్టీఆర్ ట్యాగ్ మారిందని నెటిజన్స్ గుర్తించారు. మేన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అనే ట్యాగ్ ను ఎన్టీఆర్ ఈ సినిమాకు వాడుతున్నారు. ఇకపై ఎన్టీఆర్ యంగ్ టైగర్ కాకుండా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని పిలవాలి అనమాట. ఈ పవర్ ఫుల్ ట్యాగ్ అభిమానులకు బాగా నచ్చేసింది. ఇటీవల పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఐకానిక్ స్టార్ గా మారితే.. ఇప్పుడు దేవర సినిమాతో ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారారు. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తుంది. అలాగే సైఫ్ అలీ ఖాన్.. ఎన్టీఆర్ ను ఎదుర్కొనే పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X