Jr NTR Appu: 'రత్న'కు అర్థమే పునీత్.. కన్నడలో జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ఇతర భాషా హీరోలకు తెలుగులోనూ టాలీవుడ్ హీరోలకు వేరే ఇండస్ట్రీలోనూ అభిమానులు ఉండటం సర్వసాధారణం. అలా తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలకు ఇతర రాష్ట్రాల్లో చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఆయనకు కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉన్నారు. తెలుగులో ప్లాప్ అయినా సినిమాలు ఇతర భాషల్లో సక్సెస్ సాధించాయి. ఇలా కర్ణాటకలో ఎన్టీఆర్ కు అభిమానులు భారీగానే ఉన్నారు. కన్నడ స్టార్ హీరో, దివంగత పునీత్ రాజ్ కుమార్ సినిమాలో ఎన్టీఆర్ ఓ పాట పాడటంతో కన్నడీకులకు దగ్గరైపోయాడు. ఎన్టీఆర్. తాజాగా పునీత్ రాజ్ కుమార్ గురించి ఎమోషనల్ గా స్పీచ్ ఇచ్చాడు తారక్.

కర్ణాటకలో ప్రత్యేక వేడుక..
కన్నడ స్టార్ హీరో, అప్పు, దివంగత పునీత్ రాజ్ కుమార్ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాటను జూనియర్ ఎన్టీఆర్ పాడటంతో అక్కడి ప్రజలకు దగ్గరైపోయాడు. చాలా ఇంటర్వ్యూలలో పునీత్ రాజ్ కుమార్ ఎన్టీఆర్ తనకు సోదరుడి లాంటివాడు అని ప్రతి సినిమాకు సంబంధించి అనేక విషయాలు తమ మాట్లాడుకుంటామని కూడా చెప్పాడు. దీంతో పునీత్ అభిమానులు కూడా ఎన్టీఆర్ ను ఎంతగానో ఆదరిస్తూ వస్తున్నారు. అయితే పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత ఎన్టీఆర్ కూడా ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత కర్ణాటక ప్రభుత్వం అతనికి ప్రత్యేకంగా 'కర్ణాటక రత్న' అవార్డును ప్రకటించింది. అయితే ఈ అవార్డుకు సంబంధించిన ప్రత్యేకమైన వేడుకను కర్ణాటకలో నిర్వహించారు.

'కర్ణాటక రాజ్యోత్సవ' శుభాకాంక్షలు..
పునీత్ రాజ్ కుమార్ కు ప్రకటించిన రత్న అవార్డు వేడుకలకు తమిళనాడు నుంచి సూపర్ స్టార్ రజనీ కాంత్, ఇన్ఫోసిస్ ఛైర్ పర్సన్ సుధా మూర్తి, తెలుగు రాష్ట్రాల నుంచి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. దివంగత పునీత్ రాజ్ కుమార్ కర్ణాటక ప్రభుత్వం ఇస్తున్న అత్యున్నత పురస్కారమైన 'కర్ణాటక రత్న' అవార్డును ఆయన సతీమణి అశ్విని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ కర్ణాటక ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కన్నడ ప్రజలకు 'కర్ణాటక రాజ్యోత్సవ' శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసగించారు.

అప్పు స్నేహితుడిగా వచ్చాను..
''నేను ఇక్కడికి అతిథిగా కాదు. అప్పు స్నేహితుడిగా వచ్చాను. ఎవరైనా కుటంబ పెద్దల నుంచి ఇంటి పేరునో.. వారసత్వాన్నో.. పొందుతారు. కానీ వ్యక్తిత్వాన్ని మనమే సంపాదించుకోవాలి. అహంకారం లేని వ్యక్తిత్వం. ఎప్పుడూ చిరునవ్వుతో యావత్ కర్ణాటక రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్న వ్యక్తి పునీత్ రాజ్ కుమార్. అందుకే ఆయనకు ఈ అవార్డు దక్కింది. అతని నవ్వులో ఉన్న సంపదా ఇంకెక్కడా దొరకదు. స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ కర్ణాటకలో గొప్ప సూపర్ స్టార్. ఒక గొప్ప కొడుకు. గొప్ప తండ్రి. గొప్ప స్నేహితుడు. గొప్ప యాక్టర్. డ్యాన్సర్. సింగర్ వీటన్నింటికి మించి గొప్ప మానవతా వాది. నా ఉద్దేశంలో కర్ణటాక రత్న అంటే అర్థమే పునీత్ రాజ్ కుమార్'' అని ఎమోషనల్ గా మాట్లాడారు తారక్. ఎన్టీఆర్ కన్నడలో మాట్లాడి ఆకట్టుకోగా ఆయన మాట్లాడుతున్నంతసేపు వర్షం పడింది. దీన్ని పునీత్ పై ప్రేమతో వాన పడిందని అభిమానులు అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











