Ram Charan : రామ్​ చరణ్​కు ఇలాంటి అరుధైన వ్యాధి ఉందా? షాకింగ్ సీక్రెట్​ను రివీల్ చేసిన ఎన్టీఆర్​!

సామాన్యులకైనా సెలబ్రిటీలకైనా ఏదో ఒక్కో సమస్య ఉండటం సర్వసాధారణమే. వారు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతోనో లేదా ఇతరత్ర సమస్యలతోనో ఇబ్బంది పడతుంటారు. కానీ వాటి గురించి ఎక్కువగా బయటకు చెప్పుకోరు. అలా మెగా పవర్ స్టార్​ రామ్ ​చరణ్​కు కూడా ఓ సమస్య ఉందట. చాలా రోజుల తర్వాత ఈ విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. అది కూడా యంగ్ టైగర్ తారక్ చెప్పారు. ఇంతకీ చరణ్​ బాబుకు ఉన్న ఆ సమస్యేంటో తెలుసుకుందాం...

సెల‌బ్రిటీల‌కు అన్నీ అందుబాటులోనే ఉంటాయి. వారికి ఏ క‌ష్టం తెలియ‌ద‌ని చాలా మంది అనుకుంటారు కానీ వాస్త‌వం వేరుగా ఉంటుంది. భారీ పారితోషికాలు, ఎంత సంపాద‌న ఉన్నా.. అన్నీ అందుబాటులో ఉన్నా ఎవరి సమస్యలు వాళ్ల‌కు ఉంటాయి. అయితే మెగా పవర్​ స్టార్​ రామ్​ చరణ్​కు ఓ సమస్య ఉంది. అదేంటంటే ఎదుటి వ్యక్తి పేర్లను మర్చిపోవడం. హా అవును మీరు చదివింది నిజమే. కొంతమంది ఇంటి నుంచి బయలుదేరి కొంతదూరం వెళ్లాక తమ ఇంటి అడ్రస్​ను మర్చిపోవటం లేదా తమ పేరును మర్చిపోతుంటారు. అయితే అంత పెద్ద జబ్బు చరణ్​కు లేదు కానీ ఎదుటి వ్యక్తి పేర్లను త్వరగా గుర్తుపెట్టుకునే మైండ్ పవర్ లేదట.

Junior NTR revealed the shocking secret that Ram Charan has a rare disease News Goes Viral

ఈ విషయాన్ని యంగ్ టైగర్ తారక్ చెప్పాడు. ఆయన మాట్లాడుతూ.. మా చరణ్​కు ఒక అలవాటు ఉంది. ఒక మనిషికి ఓ పేరు ఉంటుంది. అది చరణ్​కు ఎక్కదు. ఓన్ చేసుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. అసలు ముందు ఆయనకు గుర్తు ఉండదు. ఇప్పుడు నేను పరిచయమైతే నా పేరు తారక్​ అని ఆయనకు చెబుతాను. ఆ తర్వాత కారక్ అని పిలుస్తాడు. ఆయనకు అస్సలు పేర్లు గుర్తుండవు. దాన్ని ముందు వెనక కిచిడీ చేసేస్తాడు. మా సెట్స్​లో సుమేర్ అని ఒకడుండేవాడు. ఒకరోజు రామ్ చరణ్ అతడిని కాన్ఫిడెంట్​గా సమీర్ అని పిలిచాడు.

అదేంటి తన పేరు సుమేర్ కదా చరణ్ సమీర్ అని పిలిస్తే పలికాడు ఏంటని ఆలోచించాను. ఒకవేళ నేనే తప్పుగా గుర్తుపెట్టుకున్ననేమో అని అనుకున్నాను. సర్లే అని వదిలేశా. ఆ తర్వాత రోజు సమీర్ కాస్త సుమిత్ అయిపోయింది. సుమిత్​ అని చరణ్​ పిలవడంతో వాడు మళ్ళీ సార్ అని అన్నాడు. సుమేర్ కాదు సమీర్ అనుకుంటే మళ్లీ సమీర్ కూడా కాదు సుమిత్ అని అన్నాడు. అప్పుడు నేను ఆ అబ్బాయిని పిలిచి నీ పేరేంటి అని అడిగితే సుమేర్ అని క్లారిటీ ఇచ్చాడు.

Junior NTR revealed the shocking secret that Ram Charan has a rare disease News Goes Viral

మరి సమీర్​, సుమిత్ అంటే ఎందుకు పలికావు అని అడిగా. ఆయన పిలుస్తున్నాడు కదా అని రెస్పాండ్ అయ్యాను అంతే అని అతడు నాతో చెప్పుకొచ్చాడు. అంటూ తారక్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఇక ఈ కామెంట్స్​ అప్పట్లో బాగా వైరల్ అయింది. చరణ్ బ్రో చాలా పెద్ద సమస్యతోనే బాధపడుతున్నారు అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X