NTR – Rajamouli: ‘మనకు చేతకాక రాజమౌళిని బద్నాం చేస్తున్నాం’
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. వారం రోజుల్లోనే 400 కోట్ల గ్రాస్ దాటి దూసుకుపోతుంది. ఈ విధంగా వసూల్లు రాబట్టడంతో మూవీ యూనిట్ సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకుంది. హీరో, హీరోయిన్స్ మూవీ మేకర్స్ వరుస ఇంటర్య్వూలు జరుపుతోంది. తాజాగా హీరో జూనియర్ ఎన్టీఆర్-డైరెక్టర్ కొరటాల శివ ఓ ఇంటర్య్వూలు పాల్గొన్నారు. ఈ తరుణంలో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళిపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?
వాస్తవానికి రాజమౌళి , జూనియర్ ఎన్టీఆర్ బంధం ఈనాటి కాదు. రాజమౌళి తన మొదటి సినిమాలో హీరోగా జూనియర్ ఎన్టీఆరే నటించారు. తొలిసారి రాజమౌళి- జూనియర్ ఎన్టీఆర్ కాంబో వచ్చిన "స్టూడెంట్ నెం.1" సూపర్ డూపర్ హిట్ గా మారింది. అటు రాజమౌళి కెరీర్ లోనూ.. ఎన్టీర్ఆర్ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ మూవీగా మారింది. ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ నటించిన సుబ్బు సినిమా అట్టర్ ప్లాప్ అయింది. ఆ తరువాత రాజమౌళి తన రెండో సినిమా కూడా ఎన్టీఆర్ తోనే చేసారు.

వీరి క్రేజీ కాంబో లో వచ్చిన రెండో సినిమా "సింహాద్రి" ఓల్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ నాడు ఎన్నో రికార్డులను తిరుగ రాసింది. అయితే.. సింహాద్రి మూవీ తరువాత జూనియర్ ఎన్టీఆర్ 'ఆంధ్రవాలా'నటించారు. కానీ, ఈ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఈ మూవీ నుంచి ఓ సెంటిమెంట్ ప్రారంభమైంది. రాజమౌళితో హిట్ కొట్టిన హీరో తన తరువాత మూవీ కచ్చితంగా ప్లాప్ అవుతోంది. ఈ సెంటిమెంట్ యమదొంగ మూవీ తరువాత కూడా కంటిన్యూ అయ్యింది. యమదొంగ మూవీ తరువాత వచ్చిన కంత్రీ దారుణంగా ప్లాప్ అయ్యింది.
కేవలం ఈ సెంటిమెంట్ కేవలం జూనియర్ ఎన్టీఆర్ కే కాదు. మిగితా హీరోలకు కూడా వర్తించింది. రాజమౌళి నితిన్ తో 'సై' సినిమా చేసాడు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. కానీ ఆ తరువాత నితిన్ నటించిన మూవీస్ అన్ని దారుణంగా ప్లాప్ అయింది. ఈ హీరోకు సక్సెస్ అందుకోవడానికి దాదాపు 8 ఏండ్లు పట్టింది. దీనితో రాజమౌళి నటించిన ఏ హీరో తర్వాతి సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందనే ఒక టాక్ వచ్చింది. దీంతో ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఈ సెంటిమెంట్ గట్టిగా నమ్ముతున్నారు.
అయితే.. ఈ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ దేవర హిట్ తో బ్రేక్ చేశారు. ఎన్టీఆర్ మూడేండ్ల క్రితం ఆర్ఆర్ఆర్ మూవీ నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత కొరిటాల శివ డైరెక్షన్లలో వచ్చిన దేవర మూవీలో నటించారు. రాజమౌళి సెంటిమెంట్ ప్రకారం.. దేవర మూవీ కూడా ప్లాప్ అవుతూందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ లో టాక్ వచ్చింది. కానీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర హిట్ తో రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ ని బ్రేక్ అయ్యింది. ఇదే విషయాన్ని రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా అన్నారు.ఇన్నేళ్ల తర్వాత ఆ సెంటిమెంట్ మళ్ళీ ఎన్టీఆర్ బ్రేక్ చేసాడు అని ట్వీట్ చేశారు.
తాజాగా ఎన్టీఆర్ - కొరటాల శివ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేసారు.. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మనం కరెక్ట్ గా సినిమాలు చేసుకోలేక పాపం రాజమౌళి హిట్ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ సినిమా పోయిందని రాజమౌళి మీదకి తోసేస్తున్నాం.. అంతే కానీ మనకి చేతగాక క్రియేట్ చేసుకున్న టాక్ ఇది అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు..దీంతో ఎన్టీఆర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'మనం సరిగా సినిమాలు చేసుకోలేక పాపం రాజమౌళి హిట్ ఇచ్చాడు. కాబట్టి తరువాత సినిమా పోయిందని రాజమౌళి మీదకి తోసేసాం. అంతే.. కానీ, మనకి చేతగాక క్రియేట్ చేసుకున్న టాక్ ఇది. అయినా ఈ Myth Breaker అనేది వినడానికి కొంచం బాగానే ఉందన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











