తల్లి కోరిక నేరవేర్చిన తారకన్న.. తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
Junior NTR: పాన్ ఇండియా స్టార్ యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్ ఆయన తల్లితో కలిసి కర్ణాటక ఉడిపిలోని శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉడిపిలోని శ్రీ కృష్ణ ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ ఆయన తల్లితో కలిసి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి ఉడిపి జిల్లాలోని కుందాపురలోనే జన్మించారు.
పాన్ ఇండియా స్టార్ యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరు వింటే నందమూరి ఫ్యాన్స్ కు పూనకాలే.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ రొమాంటిక్ , ఎంటర్‌టైర్ దేవర చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో ఒకప్పటి కలల రాణి, దివంగత శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ బ్యూటీకి తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ.

ఇక గత నెలరోజులుగా మేకర్స్ ఈ సినిమా నుంచి వదులుతోన్న పోస్టర్లకు, గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇటీవల విడుదలైన 'చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీ లోకమే నా మైమరపు, చేతనమైతే నువ్వే నన్ను ఆపు' అంటూ సాగే పాట యువతను విపరీతంగా ఆకట్టుకుంది. సాంగ్సే ఓ రేంజ్‌లో ఉన్నాయంటే దేవర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం పక్కా అంటూ గ్లింప్స్, పోస్టర్లు వీక్షించిన తారక్ అభిమానులు సోషల్ మీడియా వేదికన కామెంట్ల మోత మోగిస్తున్నారు.
తారకన్న మూవీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్ వెయిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది. మొదటి భాగం సెప్టెంబరు 27 వ తారీకున తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించగా.. రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ రాస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే.. జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి షాలినికి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఎప్పటి నుంచో తన సొంతూరు అయిన కర్ణాటకలోని కుందపురకు వెళ్లాలని షాలిని కోరికట. అంతేకాకుండా కొడుకు ఎన్టీఆర్ తో కలిసి ఉడుపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణుడి దేవాలన్ని దర్శించుకోవాలని ఆమె అనుకుందట. కానీ ఈ కోరిక అలాగే మిగిలిపోతుందంటూ తరచూ బాధపడేదట. తాజాగా తారకన్న తన తల్లి కోరిక నెరవేర్చాడు.
షాలిని గారి సొంత ఊరు కుందాపుర. ఉడిపి శ్రీకృష్ణ ఆలయంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయం ముందు నిలబడి తన తల్లితో కలసి జూనియర్ ఎన్టీఆర్ కొన్ని ఫోటోలు తీసుకున్నారు. ఈ ఫోటోలను జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ఆయన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసి.. తన ఎమోషనల్ అయ్యారు.
తారక్ ఈ విధంగా కాప్షన్ రాసుకొచ్చారు. 'నన్నుతన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్న మా అమ్మ కోరిక. ఆ కల ఎట్టకేలకు ఇవాళ్ళ నెరవేరింది. సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు జరిగేలా చేయడం. నేను ఆమెకు ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి. నాతో వచ్చిన వికిరగండూర్ సార్ అండ్. నా ప్రియమైన స్నేహితుడు ప్రశాంత్ నీల్ కు ధన్యవాదాలు. రిషబ్ శెట్టికి ప్రత్యేక ధన్యవాదాలు. మీ సపోర్ట్ అండ్ ఈ క్షణం నాకు ఎంతో స్పెషల్' అంటూ తారక్ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా తన తల్లితో దిగిన ఫొటోలు అండ్ తారక్ స్నేహితులతో ఉన్న పిక్స్ అభిమానులతో పంచుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని కోరిక నెరవేర్చడంతో ఆమె ఫేస్ ఆనందంతో వెలిగిపోతుంది.


Click it and Unblock the Notifications











