గోపిచంద్‌తో మొదటి సారి కాజల్ అగర్వాల్.. అసలైన రొమాన్స్ చూస్తారట!
టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. తెలుగు తమిళ్ అని తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా బిజీ అవ్వాలని ప్రయత్నం చేస్తోంది. ఇకపోతే ఇటీవల తెలుగులో ఒక రొమాంటిక్ సినిమాకు ఫైనల్ గ్రీన్ సింగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
త్వరలో తేజ దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా ఒక సినిమా స్టార్ట్ కానుంది. ఆ సినిమాకు అలివేలు వెంకటరమణ అనే టైటిల్ కూడా సిద్ధం చేశారు. ఆ సినిమాలో కథానాయికగా కాజల్ అగర్వాల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అమ్మడు మొదటిసారి మాస్ హీరో హీరో గోపిచంద్ తో రొమాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీ కళ్యాణ్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

అయితే మొన్న సీత అనే సినిమా ద్వారా మళ్ళీ ఆ దర్శకుడితో పని చేసిన కాజల్ ఇప్పుడు మరొక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఆ సినిమా స్క్రిప్ట్ పనులన్నీ అయిపోయాయి. గోపిచంద్, కాజల్ మధ్య రొమాంటిక్ డోస్ ఎక్కువగానే ఉంటుందట. మొదటి సారి ఈ జంట కలిసి నటిస్తుండడంతో ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాల డోస్ కూడా పెరుగుతోంది. జూన్ తరువాత చిన్న బడ్జెట్ లోనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











