Kajal Agarwal: నందమూరి బాలకృష్ణకు కొత్త పేరు... బాలయ్యను కాజల్ ఏమని పిలుస్తుందో తెలుసా?
Kajal Agarwal : నటసింహం నందమూరి బాలకృష్ణ పేరు వింటే చాలు ఆయన అభిమానుల మొహాల్లో ఆనందం కనిపిస్తుంది. ఎక్కడ లేని హుషారు వస్తుంది. కేవలం ఆయన అభిమానుల్లోనే కాదండోయ్.. ఆయనతో పని చేసిన వాళ్లలో కూడా మనం దీన్ని చూడవచ్చు. ఆయనతో ఉన్న ప్రతీ ఒక్కరూ ఆయన మంచితనం గురించే చెబుతారు తప్ప.. ఏ ఒక్కరు కూడా ఆయన గురించి చెడుగా మాట్లాడారు. ఆయన చూపించే ప్రేమకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అయితే ఆయన తాజాగా హీరోగా చేస్తున్న చిత్రం భగవంత్ కేసరి. ఆదివారం రోజు వరంగల్ లో ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది.
ఈ కార్యక్రమంలోనే హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. బాలయ్య బాబు గురించి అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఆయనను పొగడ్తలలో ముంచెత్తుతూనే.. నందమూరి బాలకృష్ణ కొత్త పేరును బయట పెట్టింది. చాలా మంది ఆయన బాలయ్య బాబు, బాబు, బాలకృష్ణ, బాబాయ్ అని పిలుచుకుంటారు. మరికొందరు అయితే ఆయన చేసిన సినిమా పేర్లతో ఆయనను పిలుచుకుంటారు. కానీ కాజల్ చెప్పిన కొత్త పేరు విని మాత్రం అంతా షాకయ్యారు.

నా పేరు సార్ కాదు.. బ్యాల్స్!
ఆ పేరు ఏంటంటే.. బ్యాల్స్. కాజల్ ఆయనను తొలి సారి చూసినప్పుడు, అంటే కలిసి పని చేసేందుకు కలిసినప్పుడు సార్ అని పిలిచిందట. కానీ బాలయ్య బాబు ఆమెను పిలిచి నువ్వు నన్ను సార్ అనొద్దని చెప్పారట. నా పేరు బ్యాల్స్... నువ్వు అలాగే పిలవాలని అన్నారట. దీంతో కాజల్ అప్పటి నుంచి బాలకృష్ణను బ్యాల్స్ అని ముద్దుగా పిలుచుకుంటుందట. నందమూరి బాలకృష్ణ నిజంగా డౌన్ టు ఎర్త్ ఉండే మనిషి అని చెప్పుకొచ్చింది.
ఆయనతో ఎవరూ ఉన్నా.. బాలకృష్ణను స్నేహితుడిగా ఫీలవుతారని స్పష్టం చేసింది. ఓ పెద్ద కుటుంబ నుంచి వచ్చి ఇంత పెద్ద స్టార్ డమ్ వచ్చినప్పటికీ.. ఆయన అందరితోనూ బాగుంటారని కాజల్ వివరించింది. అలాగే నటసింహంతో మాట్లాడుతూ.. మీరు ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ఆకాశం కూడా కాదు మరో ప్లానెట్ ను అందుకోవాలని వివరించింది. ఇది విన్న బాలయ్య విపరీతంగా నవ్వుకున్నారు.

ది గ్రేట్ డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగాయ భగవంత్ కేసరి సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. అక్టోబర్ 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రంమలోనే వరంగల్ జిల్లా హన్మకొండలోని కాలేజీ గ్రౌండ్స్ లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. వేలాది మంది అభిమానుల మధ్య జరిగిన ఈ వేడుకలో భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ ను చాలా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే బాలయ్య బాబును ఎప్పుడూ చూడని యాంగిల్ లో చూడబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. అలాగే శ్రీలీల కూడా ప్రధాన పాత్రలో నటించబోతున్నారు. అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో విలన్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్ స్టూడియోసే బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్దిలు నిర్మిస్తుండగా... థమన్ మ్యూజిక్ అందించారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు కొడుతుందో, ఎంత మేర కలెక్షన్లు వసూలు చేస్తుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











