Don't Miss!
- News షర్మిల గురి మారిందా - వారి ఆశలపై నీళ్లు, ఫలితం తారుమారు..!!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్‌ను కూడా
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్‌లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అలా చేస్తే ఇబ్బందులు తప్పవట.. మెగా అల్లుడి జాగ్రత్తలు మామూలుగా లేవు
మెగా హీరోల నుంచి చాలా సింపుల్ గా పరిచయమైన నటుడు కళ్యాణ్ దేవ్. సాధారణంగా మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి హీరో రెడీ అయినా మెగాస్టార్ ప్రత్యేక శ్రద్ద తీసుకొని వాళ్ళ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు స్పెషల్ కేర్ తీసుకుంటారు. ఇక తోటి మెగా హీరోలు వారి క్రేజ్ తో సోషల్ మీడియాలో మరింత ప్రమోట్ చేస్తుంటారు. కానీ కళ్యాణ్ దేవ్ మాత్రం అలాంటి సపోర్ట్ లేకుండానే విజేతగా ఎంట్రీ ఇచ్చాడు.
ఇక రెండవ సినిమా 'సూపర్ మచి' షూటింగ్ ని కూడా ఇటీవల శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్న కళ్యాణ్ వరుస ఇంటర్వ్యూలతో కూడా బిజీ అయ్యాడు. ఇక వెబ్ సిరీస్ లలో ప్రస్తుతం అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా మీరేమైనా ఆ దారిలో ప్రయత్నాలు చేస్తారా అని ఎదురైన ప్రశ్నకు కళ్యాణ్ ఉహీంచని ఆన్సర్ ఇచ్చాడు. అలా చేస్తే కాస్త ఇబ్బందులు తప్పవట.
ఎందుకంటే.. ఆఫర్స్ లేకపోవడం వలనే వెబ్ సిరీస్ ల వైవు అడుగులు వేస్తున్నారని.. జనాలు అనుకోవడం స్టార్ట్ చేస్తే చాలా కష్టమని తెలియజేశాడు. ఇక పెద్ద స్టార్స్ వెబ్ సిరీస్ చేస్తే పెద్దగా ప్రాబ్లమ్ ఉండదని ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోరని అన్నాడు. ఫైనల్ గా తాను వెబ్ సిరీస్ లలో నటించాలని అనుకోవడం లేదని రూమర్స్ రాక ముందే ఈ హీరో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.