ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వైపే అందరి చూపు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 2న ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బాలయ్య హాజరవుతాడంటూ గతంలో ఉహాగానాలు వినిపించాయి. కానీ చిత్ర యూనిట్ దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంత అరవింద సమేత ప్రీరిలీజ్ ఈవెంట్ కు బాలయ్య హాజరు కావడం లేదని తేలిపోయింది.
కానీ ఈ ఈవెంట్ కు అన్నదమ్ములు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ కలసి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. తండ్రి మరణం తరువాత తొలి సారి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వేదిక పంచుకోబోతుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉండగా ప్రీరిలీజ్ ఈవెంట్ లోనే అరవింద సమేత ట్రైలర్ కూడా విడుదలచేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకేకించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా పూజ హెగ్డే నటించింది. దసరా కానుకగా అక్టోబర్ 11 చిత్రం ఈ చిత్రం విడుదుల కానుంది.


Click it and Unblock the Notifications











