Ugadi Awards 2023: నందమూరి హీరో హవా.. బెస్ట్ యాక్టర్‌గా కల్యాణ్ రామ్.. ఉత్తమ చిత్రంగా!
టాలీవుడ్‌లోకి నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు కల్యాణ్ రామ్. హీరోగా, నిర్మాతగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతోన్న అతడు.. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'బింబిసార' అనే చిత్రంతో వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో అతడు మరోసారి హిట్ ట్రాక్ కూడా ఎక్కేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా కల్యాణ్ రామ్ ఓ అదిరిపోయే అవార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఆ వివరాలు మీకోసం!

బింబిసారగా వచ్చిన కల్యాణ్ రామ్
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట తెరకెక్కించిన సినిమానే 'బింబిసార'. ఈ సోషియో ఫాంటసీ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. ఇందులో కేథరిన్ థ్రెస్సా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేశారు.

పాజిటివ్ టాక్... కలెక్షన్లు సునామీ
కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన సోషియో ఫాంటసీ చిత్రం 'బింబిసార'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విశేషమైన స్పందన దక్కింది. దీంతో కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. అదే రీతిలో ప్రభావాన్ని చూపించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా కలెక్షన్లు సునామీ సృష్టించింది.

భారీ వసూళ్లు... కోట్లలో లాభాలు
టైం ట్రావెల్ కథతో తెరకెక్కిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, ముగింపు సమయానికి ఈ సినిమాకు రూ. 37.92 కోట్లు వసూలు అయ్యాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 21.72 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

ఓటీటీ, టీవీలో కూడా స్పందన
బ్లాక్ బస్టర్ అవడంతో పాటు థియేటర్లలో చాలా రోజుల పాటు సందడి చేసిన 'బింబిసార' మూవీ ఇటీవలే జీ తెలుగు ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం అయింది. దీనికి సినిమా హాళ్లు, ఓటీటీలో మాదిరిగానే బుల్లితెరపైనా భారీ రెస్పాన్స్ లభించింది. దీంతో దీనికి రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ దక్కింది. ఇలా అన్నింట్లోనూ ఈ మూవీ సత్తా చాటినట్లు అయింది.

ఉగాది పురస్కారాల్లో బెస్ట్ మూవీ
తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యుత్తమంగా నిలిచిన సినిమా, మంచి పెర్ఫార్మెన్స్ చేసిన నటీనటులు, టెక్నీషియన్లకు శ్రీ కళా సుధా తెలుగు అసోషియేషన్ ప్రతి ఏడాది ఉగాది అవార్డుల పేరిట పురస్కారాలను అందిస్తుంది. ఇప్పుడు 25వ ఉగాది పురస్కారాల్లో భాగంగా 2022 సంవత్సరానికి గానూ ఉత్తమ చిత్రంగా నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' ఎంపికైంది.

ఉత్తమ నటుడిగా కల్యాణ్ రామ్
25వ ఉగాది పురస్కారాల్లో భాగంగా 2022 సంవత్సరానికి సంబంధించి 'బింబిసార' చిత్రంలోని నటనకు గానూ నందమూరి కల్యాణ్ రామ్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ఈ అవార్డులను బుధవారం రాత్రి చెన్నై, రాయపేటలోని మ్యూజిక్ అకాడమీలో జరిగిన వేడుకలో ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దీనిపై ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











