‘118’ తర్వాత కళ్యాణ్ రామ్ చేయబోయే సినిమా ఇదేనా?
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ '118' మార్చిన 1న విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న కళ్యాణ్ రామ్ దీని తర్వాత వెంటనే మరో సినిమాకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
'118' తర్వాత కళ్యాణ్ రామ్ మరో మూవీకి సైన్ చేశారని, ఈ చిత్రాన్ని వశిష్ట అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. వశిష్ట చెప్పిన స్క్రిప్టు విన్న కళ్యాణ్ రామ్ చాలా ఎగ్జైట్ అయ్యారని, పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామా, కుటుంబ పరమైన ఎమెషన్స్‌తో ఈ చిత్రం ఉంటుందని టాక్.

ఈ మధ్య కాలంలో కళ్యాణ్ రామ్ నుంచి ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో సినిమా రాలేదు. ఈ స్క్రిప్టు కూడా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారట. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో అన్ని వివరాలు వెల్లడికానున్నాయి.
118 సినిమా విషయానికొస్తే.. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తోన్న స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్స్‌గా నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 1న విడుదలవుతుంది.


Click it and Unblock the Notifications











