బాబాయ్ కోసం 25 రోజులు కేటాయించిన కళ్యాణ్ రామ్!
ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ నెమ్మదిగా వేగం పెరుగుతోంది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రంలో కీలకమైన ఒక్కో పాత్రలని రంగంలోకి దించుతున్నాడు. బాలయ్య స్వయంగా తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నాడు. విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నటిస్తోంది. ఇక ఆరడుగుల ఆజాను బాహుడు దగ్గుబాటి రానా చంద్రబాబు పాత్రలో నటిస్తూ షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు.
త్వరలోనే ఏఎన్నార్ పాత్ర కోసం హీరో సుమంత్ కూడా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. తాజగా ఈ చిత్రం గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బయోపిక్ కోసం 25 రోజుల కాల్ షీట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే కళ్యాణ్ రామ్ పాత్రకు సంబందించిన షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటించబోతున్నాడు. హరికృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ స్థాపించిన తరువాత ప్రచారంలో హరికృష్ణ రథ సారధిగా కీలక పాత్ర పోషించారు. ఆ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తుండడంతో ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











