జై బాలయ్య గోల.. మర్యాద నేర్పిన కళ్యాణ్ రామ్, తమ్ముడి మాట ఫాలో అవుతానంటూ!
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తోన్న స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ '118'. నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకత్వం వహించగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేష్ కొనేరు నిర్మిస్తున్నారు. మార్చి 1న సినిమా రిలీజ్ చేస్తున్న సందర్భంగా గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు బాలయ్య, జూ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే తాను మైక్ పట్టుకుని ప్రసంగం మొదలు పెట్టగానే అడ్డు పడుతూ అభిమానులు గోల చేయడంతో కళ్యాణ్ రామ్ కాస్త అసహనానికి గురయ్యారు.

మర్యాదగా ప్రవర్తించాలి
‘నందమూరి అభిమానులకు రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి గోల చేయడం ఆపండి. మనకు ఇన్స్‌స్పిరేషన్ పెద్దాయన రామారావుగారు. మనం అందరం సభ మర్యాదను మరిచిపోకూడదు' అంటూ కళ్యణ్ రామ్ వేడుకున్నారు.

జై బాలయ్య జైజై బాలయ్య అంటూ మళ్లీ
కళ్యాణ్ రామ్ ఎంత వారించినా కొందరు ఫ్యాన్స్ ఆగలేదు. జై బాలయ్య జైజై బాలయ్య అంటూ నినాదాలు చేయడంతో ‘ప్లీజ్ అండీ.. మనం నందమూరి అభిమానులం.. అదొక్కటి గుర్తు పెట్టుకోండి. మనకు దేవుడు నందమూరి తారకరామారావుగారు. ఆదేవుడి ఆశీర్వాదంతోనే మేము ముగ్గురం ఇక్కడ ఉండగలుగుతున్నాం. కొంచెం(డిసిప్లిన్) మెంటేన్ చేయండి అంటూ కళ్యాణ్ రామ్ వేడుకున్నారు.

నా మైండ్ బ్లాక్ అయింది
కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ... ‘బాబాయ్, తమ్ముడు కలిసి నా సినిమా ఫంక్షన్ కోసం రావడంతో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు.. మైండ్ బ్లాక్ అయింది. చాలా మాట్లాడాలని ఉంది. ఈ సారి సినిమా రిలీజైన తర్వాత మాట్లాడాలని డిసైడ్ అయ్యాను. నాకు ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది.' అన్నారు.
తమ్ముడు మాట ఫాలో అవుతా
ప్రతిసారి ఏదో ఒక కొత్తదనం ట్రై చేయాలనుకుంటున్నాను. విభిన్నంగా మీ ముందు ఉంచాలన్న తపనతో ట్రై చేస్తూ ఎక్కడో ఒక చోట ఫెయిల్ అవుతున్నాను. మీకూ ఈ విషయంలో బాధ ఉందని తెలుసు. టెంపర్ సినిమా ఆడియో ఫంక్షన్ లో తమ్ముడు చెప్పినట్లు మమ్మల్ని మెప్పించడానికి ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాను. అదే మళ్లీ చెబుతున్నాను. ఈ సినిమా మీద నాకు చాలా నమ్మకం ఉందని కళ్యాణ్ రామ్ అన్నారు.


Click it and Unblock the Notifications











