కళ్యాణ్ రామ్ హిస్టారికల్ మూవీ బింబిసార.. బడ్జెట్ ఎంతో తెలుసా?
కళ్యాణ్ రామ్ కెరీర్ లో మొదటిసారి ఒక భారీ ప్రయోగానికి సిద్ధమయ్యాడు. కెరీర్ మొదటి నుంచి కూడా విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న కళ్యాణ్ కొన్ని బాక్సాఫీస్ హిట్స్ కూడా అందుకున్నాడు. అయితే ఎన్ని హిట్స్ అందుకున్నా కూడా కళ్యాణ్ రామ్ ఇంకా అనుకున్నంత స్థాయిలో తన మార్కెట్ అయితే పెంచుకోలేకపోతున్నాడు.
ఇక ఈసారి ఎలాగైనా సరే పవర్ఫుల్ హిట్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. కొత్త దర్శకుడు వశిష్ట్ దర్శకత్వంలో చేసిన బింబిసార అనే సినిమాపై ఇటీవల క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ను పెంచుకోవాలని కళ్యాణ్ రామ్ భారీ రిస్క్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా కోసం దాదాపు 40కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. ఇంతవరకు కళ్యాణ్ రామ్ సినిమలేవి కూడా ఈ స్థాయిలో తెరపైకి రాలేసు. ఏ సినిమా కూడా ఆ రేంజ్ లో కలెక్షన్స్ సాధించింది కూడా లేదు.

అలాంటిది మొదటిసారి హిస్టారికల్ కథను నమ్ముకొని కష్టపడుతున్నాడు. సినిమా ఎలాగైనా సక్సెస్ అవుతుందని ముందు ఒక పార్ట్ తో స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక ఆ సినిమా విడుదల అనంతరం రిజల్ట్ ను భట్టి సెకండ్ పార్ట్ ను అలాగే థర్డ్ పార్ట్ ను తెరపైకి తీసుకు వస్తారాట. ఇక ఈ సినిమా షూటింగ్ అయితే ఇప్పటికే 80% పూర్తయ్యింది. పెద్దగా ప్రచారాలు లేకుండానే సినిమాను స్టార్ట్ చేశారు. ఇక ఇప్పుడు చివరి దశకు వచ్చేశారు. సినిమాకు ఫస్ట్ లుక్ తోనే మంచి బజ్ క్తియేట్ అయ్యింది. ఇక ఎన్టీఆర్ కూడా సినిమాకు డబ్బింగ్ చెప్పనున్నట్లు టాక్ వస్తోంది. మరి సినిమా మొత్తంగా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











