హిట్టా ఫట్టా డోంట్ కేర్.. కల్యాణ్ రామ్ మరో ప్రయోగం

హిట్టా ఫట్టా అనేది సంబంధం లేకుండా ప్రయోగాలు చేయడం యువతరం హీరో నందమూరి కల్యాణ్ రామ్ ఎప్పుడూ ముందుంటాడు. ఆయన నటించిన అతనొక్కడే నుంచి 118 వరకు ఎంత డిఫరెంటో తెలియజేస్తాయి. తాజాగా మరో విభిన్నమైన సినిమా, విలక్షణమైన పాత్రతో ఎంత మంచి వాడవురా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

శతమానం భవతి చిత్రానికి జాతీయ అవార్ఢు గెలుచుకొన్న సతీష్ వెగేశ్న ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ పాత్ర గురించి దర్శకుడు సతీష్ గొప్పగా చెప్పడంతో అంచనాలు పెరుగుతున్నాయి.

Kalyanram again with experiment with Entha Manchi Vaadavu Raa

ఇటీవల మీడియాతో సతీష్ వెగ్నేశ మాట్లాడుతూ.. కల్యాణ్ గారు ఇలాంటి ఫ్యామిలీ డ్రామాను ఇప్పటి వరకు చేయలేదు. నేను మొదటిసారి కథ చెప్పినప్పుడే ఆయన సినిమాతో అనుబంధం పెంచుకొన్నారు. కల్యాణ్ రామ్ లాంటి కమర్షియల్ హీరో ఇలాంటి ఫ్యామిలీ డ్రామాకు ఓటు వేయడంతోనే సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. సినిమాకు ఆకర్షణ కూడా వచ్చింది అని దర్శకుడు అన్నారు.

ఎంత మంచి వాడవురా సినిమా అత్యంత భావోద్వేగాలతో కూడుకొన్న సినిమా. చాలా సున్నితమైన, అందమైన స్క్రిప్టు. అర్బన్, రూరల్ బ్యాక్ డ్రాప్‌తో నడిచే కథ. ఎవరూ ఊహించని అనుభూతిని కలుగచేస్తుంది. అందర్నీ ఆకట్టుకొనే పాత్రలో కల్యాణ్ రామ్ కనిపిస్తాడు అని సతీష్ వెగేశ్న వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X