ఒళ్ళు గగుర్పొడిచే రూపాన్ని ఆవిష్కరించిన కమల్.. విక్రమ్ ఫస్ట్ లుక్ వైరల్!
లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో చియాన్ విక్రమ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేశారు. కమల్ హాసన్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ జరిగింది. ఈ చిత్రానికి కాధారం కొండాన్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఫస్ట్ లుక్ లో విక్రమ్ రూపం భయంకరంగా ఉంటూ ఆకర్షిస్తోంది.
విభిన్నమైన పాత్రలు చేయడానికి ఎప్పుడూ ముందుండే విక్రమ్ మరోమారు ప్రయోగాత్మక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం రాజేష్ ఎం సెల్వ దర్శత్వంలో తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ కూడా కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం.

కండలు తిరిగిన శరీరంతో విక్రమ్ కనిపిస్తున్నాడు. ఒంటిపై భారీగా టాటూలు కనిపిస్తున్నాయి. చేతికి బేడీలు ఉన్నాయి. విక్రమ్ కు ఇది 56వ చిత్రం. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విశేషాలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











