దటీజ్ కమల్ హాసన్.. ఏకంగా ఐదు భాషల్లో రికార్డు బ్రేక్
విలక్షణ నటుడు కమల్ హసన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పటికే దాదాపు ప్రధాన భాషల్లో అద్బుతమైన పాత్రలు, సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. ఆయన తొలిసారి ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమాలో విలన్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో కమల్ సాధించిన ప్రతిభ గురించిన వివరాల్లోకి వెళితే..
మహనటి ఫేమ్ నాగ్ అశ్విన్, ప్రభాస్, అమితాబ్, దీపిక పదుకోన్, దిశా పటానీ నటించిన కల్కి చిత్రాన్ని సుమారుగా 600 కోట్ల రూపాయలతో అద్బుతమైన విజువల్ గ్రాఫిక్స్‌తో తెరకెక్కించారు. ఇన్‌సైడ్ రిపోర్టు ప్రకారం.. ఈ సినిమా విజువల్ అండర్ అనే టాక్ వినిపిస్తున్నది. అయితే ఈ సినిమాలో కమల్ అత్యంత భయంకరమైన పాత్రలో నటిస్తున్నారనే విషయం ట్రైలర్ స్పష్టం చేసింది.

ఇక ఈ చిత్రంలో సుప్రీం యాస్కిన్ పాత్ర కోసం గుండు పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర మేకప్ కోసం ఆయన కొన్ని గంటలపాటు శ్రమించే వారు. మేకప్ తీయడానికి కూడా గంటల సమయం పట్టడంతో ఓపికగా తీసేసుకొని షూట్ నుంచి బయటకు వెళ్లే వారని చెప్పారు.
ఈ సినిమా కోసం షూటింగులోనే కాదు.. షూటింగ్ బయట.. పోస్ట్ ప్రొడక్షన్‌లో అంతే విధంగా శ్రమించారు. ఈ సినిమా కోసం ఆయన డబ్బింగ్ కేవలం ఒకే భాషలో చెప్పలేదు. దాదాపు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పారని తెలిసింది.

కల్కి 2898 ఏడీ మూవీ కోసం ఆయనకు భారీగా రెమ్యునరేషన్ చెల్లించారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆయనకు సుమారుగా 50 కోట్ల రూపాయలు చెల్లించినట్టు తెలిసింది. మొదటి పాత్రలో ఎంట్రీ వరకు ఓకే అని.. సెకండ్ పార్ట్‌లో కమల్ హసన్ రోల్ పూర్తిగా భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











