నా తొలి ప్రేమకు సాక్షి, పెళ్లికి కారణం బాలునే.. నా రొమాంటిక్ జీవితంలో కూడా.. కమల్ హాసన్ కంటతడి

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతితో సంగీత ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణాన్ని అభిమానులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని కమల్ హాసన్ భావోద్వేగంగా పంచుకొన్నారు. తన జీవితంలో ఎస్పీ బాలు ఎలా కీలక పాత్రను పోషించారనే విషయాన్ని సవివరంగా మీడియాకు వెల్లడించారు. బాలు లేని లోటు పూడ్చలేరంటూ కంటతడి పెట్టారు. కమల్ పంచుకొన్న విషయాలు ఇవే...

నా జీవితంలో కీలక పాత్ర

నా జీవితంలో కీలక పాత్ర

ఎస్పీ బాలుతో పరిచయం ఎలా అంటే ఏం చెప్పాలి. నీవు తొలి పలుకు మాట్లాడిన విషయం గుర్తుందా? నీ తల్లిని, సోదరుడిని మొదటిసారి ఎప్పుడు చూశావని అడిగితే చెప్పగలమా? బాలుతో పరిచయం ఎలా ప్రారంభమైందంటే నా వద్ద నుంచి అలాంటి సమాధానమే వస్తుంది. నాకు పరిచయం కాకముందే బాలు గురించి చాలా విన్నాను. ఆయన మరణం తర్వాత అతడు నా జీవితంలో ఎంత కీలక పాత్ర పోషించారనే విషయం అర్ధమవుతున్నది అని కమల్ హాసన్ తెలిపారు.

విషాదాల్లోను, సంతోషంలోనూ బాలునే

విషాదాల్లోను, సంతోషంలోనూ బాలునే

నా కెరీర్‌లోనే కాదు, నా వ్యక్తిగత జీవితంలో కూడా గొప్ప పాత్ర పోషించారు. నా జీవితంలో రొమాన్స్, నా తొలి ప్రేమకు ఆయనే సాక్షి, నా మొదటి పెళ్లికి ఆయనే కారణం. నా జీవితాన్ని తీర్చి దిద్దింది ఆయనే. నా జీవితం విషాదాల్లోనూ ఆయన కనిపిస్తారు. నా సినీ కెరీర్‌ ఇలా ఉందంటే ఎస్పీ బాలు ఓ కారణం. అలాంటి బంధం, అనుబంధం మా మధ్య ఉంది అని కమల్ హాసన్ పేర్కొన్నారు.

ప్రేక్షకులే మా ఇద్దరిని కలిపారు

ప్రేక్షకులే మా ఇద్దరిని కలిపారు

మా కెరీర్ కోసం మేమిద్దరి ఏకం కాలేదు. ప్రొఫెషనల్స్‌గా మేము కలువలేం. ప్రేక్షకులే మమల్ని మరింత దగ్గరకు చేర్చారు. మా ఇద్దరి కలయిక అద్బుతంగా ఉందని భావించారు కాబట్టి వారిని నుంచి అలాంటి డిమాండ్ వచ్చింది. దాంతో మా మధ్య బలంగా మారడానికి ప్రేక్షకులే కారణమయ్యారు. ఆ తర్వాత మా మధ్య విడదీయలేని సోదరభావం ఏర్పడింది.

Recommended Video

Rajinikanth,Pawan Kalyan,K viswanath Expresses Their Condolences For SPB
 ఓ భాషకు బాలును పరిమితం చేయొద్దు

ఓ భాషకు బాలును పరిమితం చేయొద్దు

బాల సుబ్రమణ్యం జాతీయ స్థాయి గాయకుడు. అతడిని ఓ భాషకు పరిమితం చేయవద్దు. గత ఐదు దశాబ్దాల కాలంలో 16 భాషల్లో పాటలు పాడారు. ఆయన విద్యా సంస్కారం ఉన్న గాయకుడు. బాగా చదువుతారు, సంగీతాన్ని బాగా అర్ధం చేసుకొన్న కోవిదుడు. దాదాపు 40 వేలకుపైగా పాటలు పాడారు. విమర్శలను, ప్రశంసలను సమానంగా తీసుకొనే గొప్ప వ్యక్తి అంటూ కమల్ తనతో ఉన్న అనుబంధాన్ని చెప్పారు.,

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X