Kamal on ProjectK Movie: మళ్లీ 50ఏళ్ల తర్వాత కలిశాం.. ప్రభాస్ తో 'ప్రాజెక్ట్ కె'పై కమల్ హాసన్ కామెంట్స్

మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ప్రాజెక్ట్ కె కోసం.. అనౌన్స్ మెంట్ వచ్చిన మొదటి రోజు నుంచి అభిమానులు ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా.. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో తాజాగా కమల్ హాసన్ కూడా జాయిన్ అయినట్లు ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమాపై లోక నాయకుడు కమల్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే...

ప్రాజెక్టు కె లోకి కమల్ ఎంట్రీ : కమల్ హాసన్ ఇటీవల విక్రమ్ హిట్ లిస్ట్ సినిమాతో లైన్ లోకి వచ్చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను వసూలు చేసింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సౌత్ ఇండస్ట్రీయే కాకుండా.. నార్త్ లోనూ మంచి వసూళ్లు వచ్చాయి. ఇదిలా ఉంటే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమాను కూడా పట్టాలెక్కించాడు కమల్. ఇప్పుడు తాజాగా ప్రాజెక్టు కె లోకి ఎంటర్ అయ్యాడు.

 kamalprabhas

అఫీషీయల్ అనౌన్స్ మెంట్ : డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ తారాగణంతో రూపొందిస్తోన్న ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, హీరోయిన్ దిశాపటానీ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ మూవీలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ మూవీలో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్నారంటూ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

 kamalhassan

ప్రాజెక్ట్ కె పై కమల్ నోట్ : ఇక ఈ విషయాన్ని కమల్ హాసన్ కన్‌ఫర్మ్ చేస్తూ ఒక నోట్ షేర్ చేశారు. ఇందులో తమ నెక్ట్స్ జనరేషన్ కో స్టార్స్ గురించి మాట్లాడుతూనే లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తనకు ఏ విధంగా ఆదర్శమో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా 50 ఏళ్ల కిందట తాను డాన్స్ అసిస్టెంట్‌ గా, అసిస్టెంట్ డైరెక్టర్‌ గా ఉన్నటువంటి రోజులను గుర్తు చేసుకున్నాడు. అప్పుడు ప్రొడక్షన్‌ కు సంబంధించి నిర్మాత అశ్వినీదత్ పేరు ఎక్కువగా వినిపించేదన్నారు.

projectk2

అమితాబ్ తో కలిసి నటించడంపై : అయితే దాదాపు 50 ఏళ్ల తర్వాత మళ్లీ ఇద్దరం కలిసి పనిచేస్తున్నామని చెప్పుకొచ్చాడు. తమ నెక్ట్స్ తరానికు చెందిన బ్రిలియంట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రంలో ప్రభాస్, దీపిక వంటి కో యాక్టర్స్‌ తో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇక అమితాబ్ బచ్చన్‌ తో కలిసి పనిచేయడాన్ని ప్రస్తావిస్తూ.. గతంలో ఆయనతో కలిసి నటించినప్పటికీ... ప్రతిసారి ఫస్ట్ టైమ్ మాదిరిగానే అనిపిస్తుందని చెప్పారు. అంతేకాదు ఆయన తనను తాను ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉన్నారని తెలిపాడు. తాను కూడా అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నట్లు చెప్పారు.ఇక ప్రేక్షకులు ఏ స్థానంలో నిలిపినా తాను మాత్రం ముందుగా సినిమా అభిమానినని వెల్లడించారు.

 kamalhassan

కమల్ కు వెల్కమ్ చెప్పిన ప్రభాస్, అబితాబ్ : ఇక అటు అమితాబ్ బచ్చన్, ప్రభాస్ కూడా కమల్ హాసన్ ఎంట్రీపై స్పందించారు. చాలా ఆనందంగా ఉందంటూ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు పెట్టారు. ఇక ఈ సినిమాలో కమల్ రోల్ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ముగ్గురు పాన్ ఇండియా స్టార్లు కలిసి రణరంగం సృష్టించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X