ట్రాన్స్‌జెండర్ మహిళగా బిగ్‌బీ.. లక్ష్మీగా అదరగొట్టనున్న అమితాబ్!

Recommended Video

Amitabh Bachchan To Play Transgender Woman In Akshay Kumar Starrer Kanchana ? || Oneindia Telugu

గత దశాబ్దాలుగా సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ యాంగ్రీ మ్యాన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆరిస్టుగా విభిన్నమైన పాత్రలతో పలు రకాలుగా ప్రేక్షకులను రంజింప చేస్తున్నారు. సుమారు ఎనిమిది పదుల వయసులోనూ యువ హీరోలకు ధీటుగా తన పాత్రలతో సవాల్ విసురుతున్నారు. తాజాగా ట్రాన్స్‌జెండర్ మహిళగా ఓ కీలకమైన పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నాడు. దక్షిణాదిలో ఘన విజయం సాధించిన బ్లాక్ బస్టర్ చిత్రం కోసం అమితాబ్ బచ్చన్ లక్ష్మీగా మారనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్నీ వివరాలు..

 అక్షయ్ కుమార్‌తో కాంచన రీమేక్

అక్షయ్ కుమార్‌తో కాంచన రీమేక్

ముంబైలో లక్ష్మీ చిత్రం పాటతో ప్రారంభమైంది. ఓ రిసార్టులో హీరో అక్షయ్ కుమార్‌పై ఓ పాటను చిత్రీకరించారు. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా కథలో కీలకమైన మార్పులు చేసినట్టు సమాచారం. కాంచన చిత్రంలో హీరో పిరికివాడుగా కనిపిస్తాడు. అతడిని దెయ్యం ఆవహించడంతో విలన్లను చంపుతాడు. కానీ లక్ష్మీ విషయానికి వస్తే తమిళ వెర్షన్‌కు భిన్నంగా ఉంటుదంట.

కాంచన రీమేక్‌లో మార్పులు, చేర్పులు

కాంచన రీమేక్‌లో మార్పులు, చేర్పులు

లక్ష్మీ చిత్రంలో అక్షయ్ కుమార్ పిరికి వాడిగా కనిపించడనేది తాజా సమాచారం. కాంచన చిత్రంలో మూడు దెయ్యాలు ఉంటే.. ఈ చిత్రంలో ఒకటే దెయ్యం ఉంటుందట. ఇలా కథలో కొన్ని మార్పులు చేసి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

శరత్ కుమార్ పాత్రలో అమితాబ్

శరత్ కుమార్ పాత్రలో అమితాబ్

కాంచన చిత్రంలో ట్రాన్స్ జెండర్ మహిళగా శరత్ కుమార్ నటించాడు. తన నటనతో కాంచన సినిమాను ఆయన మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. సినిమా విజయానికి శరత్ కుమార్ ప్రధాన కారణమంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటి పాత్రను ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ చేస్తున్నారనే బాలీవుడ్ సమాచారం. అధికారికంగా త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలిసింది.

లక్ష్మీగా అమితాబ్

లక్ష్మీగా అమితాబ్

లక్ష్మీగా అమితాబ్ బచ్చన్‌కు సంబంధించిన మేకప్, తదితర అంశాల ఆడిషన్ జరిగిందట. బిగ్‌బీ పాత్ర రూపురేఖలపై, ఆయన ఆహార్యం, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలనే విషయంపై కసరత్తు చేశారట. లక్ష్మీ పాత్రలోకి అమితాబ్ పరకాయ ప్రవేశం చేసి అదరగొట్టడం ఖాయమనే మాట బలంగా వినిపిస్తున్నది.

కాంచన 3 మూవీ కలెక్షన్లు

కాంచన 3 మూవీ కలెక్షన్లు

ఇక లారెన్స్ విషయానికి వస్తే, తొలిసారి ఆయన బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఇటీవల కాంచనకు సీక్వెల్‌గా వచ్చిన కాంచన 3 దక్షిణాదిలో ఘన విజయం సాధించింది. సినీ విమర్శకులు చేతులెత్తేసినా రికార్డు స్థాయిలో కలెక్షన్లు కురిపిస్తున్నది. తొలి మూడు రోజులకే ఈ సినిమా సుమారు రూ.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X