మహేష్ సినిమాలో సీనియర్ హీరో.. టాలీవుడ్ రీ ఎంట్రీ?
సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతి భరిలో సరిలేరు నికేవ్వరు సినిమాతో సాలీడ్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న మహేష్ నెక్స్ట్ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా కొంత డిఫరెంట్ గా ఉండేలా కొత్త తరహా కథలను ఎంచుకుంటున్నాడు. నెక్స్ట్ ఈ హీరో సినిమాలో మరొక సీనియర్ హీరో కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు టాక్ వస్తోంది.

నెక్స్ట్ సినిమా అతనితోనే..
గీతగోవిందం దర్శకుడు పరశురామ్ చెప్పిన కథను ఫైనల్ గా ఒకే చేసిన మహేష్ ఆ సినిమాను వీలైనంత త్వరగా స్టార్ట్ చేసి ఇదే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న మహేష్ తదుపరి ప్రాజెక్టులపై కూడా చర్చలు జరుపుతున్నారట.

మహేష్ కొత్త యాంగిల్..
దర్శకుడు పరశురామ్ తన సినిమాల్లో రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ ని ఎలా ప్రజెంట్ చేస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మహేష్ సినిమాలో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే ఎక్కువ కొత్త తరహా రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయట. మహేష్ పూర్తిగా కొత్త యాంగిల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే బాడీ లాంగ్వేజ్, స్టైల్ కూడా మారిపోతున్నట్లు సమాచారం.

సీనియర్ హీరో స్పెషల్ రోల్..
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తెలుగు సినిమాల్లో నటించి చాలా కాలమవుతోంది. ఆయన చేసిన ప్రయోగాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ ని అందుకున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఆయన డైరెక్ట్ తెలుగు సినిమా చేసి చాలా కాలమవుతోంది. చివరగా s/o సత్యమూర్తి సినిమాలో స్పెషల్ పాత్రలో కనిపించిన ఉపేంద్ర ఇన్నాళ్లకు మహేష్ సినిమా ద్వారా మళ్ళీ టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

మహేష్ కోసమే..
ఉపేంద్ర హీరోగా ఇప్పటికే కన్నడలో ఒక స్టార్ గా ఎదిగారు. ఇక ఇతర సినిమాల్లో గెస్ట్ రోల్స్ కోసం ఆయన ఎప్పుడైనా సిద్ధంగా ఉంటారు. చాలా మంది హీరోలతో ఆయన కలిసి నటించారు. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఆయన కేవలం మహేష్ కోసమే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ ముగిసిన అనంతరం పరశురామ్ మహేష్ కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.


Click it and Unblock the Notifications











