Yash Dance Video ఓకే ఫ్రేమ్‌లో సూపర్ స్టార్స్.. క్రేజీగా యష్‌తో ఆ స్టార్ హీరో స్టెప్పులు!

కన్నడ ఇండస్ట్రీలో దర్శన్ సూపర్ స్టార్ గా ఉన్న సంగతి తెలిసిందే. అతనికి మహేష్ బాబు రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్ సినిమాలు చాలా వరకు దర్శన్ కన్నడంలో రీమేక్ చేసి హిట్స్ కొట్టాడు. ఇక రాకింగ్ స్టార్ యష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం యష్ 19 మూవీ కోసం సిద్ధం అవుతున్నాడు.

ఇక కేజీఎఫ్ సిరీస్ లో పార్ట్ 3 కూడా ఉందని గతంలో నిర్మాత విజయ్ కిరంగదూర్ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా బెంగుళూరులో సుమలత, కన్నడ రెబల్ స్టార్ స్వర్గీయ అంబరీష్ కుమారుడు అభిషేక్ అంబరీష్ వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకి సౌత్ లోని చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక కన్నడ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు అందరూ కూడా ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు.

Kannada superstars darshan and yash shared the stage at abhishek wedding party

అలాగే వెడ్డింగ్ పార్టీలో డాన్స్ లు కూడా వేయడం విశేషం. రాకింగ్ స్టార్ యష్, సూపర్ స్టార్ దర్శన్ కలిసి అంబరీష్ సినిమాలలోని పాటలకి స్టెప్పులు వేశారు. అలాగే సుమలత కూడా వారిద్దరితో కలిసి స్టేజ్ పై డాన్స్ చేయడం విశేషం. వీటికి సంబందించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టార్స్ అయిన కూడా ఎలాంటి మొహమాటం లేకుండా స్టేజ్ పైన అందరి మధ్యలో డాన్స్ లు చేస్తూ అలరించడం విశేషం.

ఇతర చిత్ర పరిశ్రమలలో స్టార్ హీరో అనే ట్యాగ్ వస్తే ఇక స్టేజ్ లపైన చాలా ప్రొఫెషనల్ ఆటిట్యూడ్ తో బిహేవ్ చేస్తూ ఉంటారు. అయితే స్టార్ హీరోలు అయిన యష్, దర్శన్ మాత్రం ఎలాంటి ప్రొఫెషనల్ ఆటిట్యూడ్ లేకుండా కలిసిపోయి ఎంజాయ్ చేయడం ఆహుతులని అలరించింది. అలాగే అభిమానులని కూడా యష్, దర్శన్ కలిసి డాన్స్ చేయడాన్ని ఆశ్వాదిస్తూ ఉన్నారు.

రాకింగ్ స్టార్ స్టార్ నెక్స్ట్ మూవీ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న అతని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇక దర్శన్ యష్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ వస్తేచూడాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు. ఒక వేళ వస్తే మాత్రం అది సౌత్ ఇండియాలో అతి పెద్ద ప్రాజెక్ట్ అవుతుందని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X