స్టార్ కమెడియన్ పెళ్లి.. ఎట్టకేలకు ప్రియురాలితో పెళ్లి
బాలీవుడ్‌లో పెళ్లి సందడి కొనసాగుతూనే ఉంది. అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ, దీపికా పదుకోన్-రణ్‌వీర్ సింగ్ పెళ్లిలతో హిందీ చిత్ర పరిశ్రమ కళకళలాడింది. త్వరలోనే ప్రియాంక చోప్రా పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే క్రమంలో మరో స్టార్ కమెడియన్, హీరో కపిల్ శర్మ వివాహానికి ముహుర్తం కుదిరింది.
కొద్దికాలంగా ప్రేమ వ్యవహారం నడుపుతున్న తన ప్రేయసి గిన్న ఛత్రాత్‌తో తన వివాహం జరుగునున్నదని కపిల్ శర్మ ట్వీట్ చేశారు. డిసెంబర్ 12 వివాహానికి ముహుర్తం నిర్ణయించినట్టు పేర్కొన్నాడు. అందంగా రాసిన వెడ్డింగ్ కార్డును కూడా పోస్టు చేశారు.
గిన్నీతో పెళ్లి జరుగుతుందనే విషయంతో నేను సంతోషంలో మునిగిపోయాను. ఆమెతో పెళ్లి నా జీవితంలో గొప్ప మార్పు తెస్తుంది. క్రమశిక్షణ పెరుగుతుంది. నన్ను ప్రేమగా చూసుకొంటుంది. నా జీవితానికి ఆమె పెద్ద అండ. నా పెళ్లికి వచ్చి దీవెనలు అందించాలి అని కపిల్ శర్మ తన ట్విట్టర్‌లో రాశాడు.

కపిల్ పెళ్లి పంజాబ్‌లోని అమృత్ సర్‌లో జరుగనున్నది. ఆ తర్వాత పంజాబ్, ముంబైలో పెళ్లి రిసెప్షన్‌కు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. గతంలో గిన్నీతో పెళ్లికి పెద్దల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ వారిని ఒప్పించి పెళ్లికి సిద్దమవుతున్నారు.
కామెడీ నైట్స్ విత్ కపిల్ అనే కామెడీ షోతో కపిల్ శర్మ అత్యంత ప్రజాదరణ పొందాడు. ఆ తర్వాత కిస్ కిస్కో ప్యార్ కరూ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించాడు. రెండో చిత్రం ఫిరంగి ప్రొడక్షన్‌లో ఉంది. ఇటీవల పంజాబీ భాషలో సన్నాఫ్ మంజిత్ సింగ్ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.


Click it and Unblock the Notifications











