twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Allu Arjun కి కరణ్ జోహార్ కొత్త బిరుదు.. స్టైలిష్, ఐకాన్ కాదుహిందీలో అంతకు మించి!

    |

    ఒకప్పుడు స్టైలిష్ స్టార్ గా మనందరికీ పరిచయం అయి తెలుగు సినిమాల్లో సత్తా చాటిన అల్లు అర్జున్ 'పుష్ప ది రైజ్' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌డమ్ సంపాదించుకుని ఐకాన్ స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. 'పుష్ప ది రైజ్' నార్త్ బెల్ట్‌లో అంచనాలకు మించి విజయాన్ని అందుకుని అక్కడ సినిమాను కొనుకున్న వారికి కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ క్రమంలో కరణ్ జోహార్ అల్లు అర్జున్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు

     వంద కోట్ల క్లబ్‌లో

    వంద కోట్ల క్లబ్‌లో

    'ఆర్య', 'ఆర్య 2' తర్వాత అల్లు అర్జున్‌ - సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా, సునీల్, అనసూయ నెగెటివ్ రోల్స్‌లో కనిపించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చగా పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కింది. ఇలా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. అందుకు అనుగుణంగా అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్ అయింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరిపోయింది.

    ఆ లోటు

    ఆ లోటు

    అయితే మరి అలాంటి విజయం ఈ సినిమాకు ఎలా సాధ్యమైంది.? అని కరణ్ జోహార్‌ని ప్రశ్నిస్తే, దానికి ఆయనిచ్చిన సమాధానమే ఆసక్త్తికరంగా మారింది అదేమిటి అంటే ఊరమాస్ సినిమాలు బాలీవుడ్‌లో రావడంలేదనీ, ఆ లోటు 'పుష్ప' తీర్చిందనీ, అందుకే 'పుష్ప' అంత పెద్ద విజయం సాధించిందని కరణ్ జోహార్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

    శాటిలైట్ స్టార్‌గా

    శాటిలైట్ స్టార్‌గా


    70లలో హిందీ తెరపై మాస్ సినిమాలు వచ్చేవని, ఆ తర్వాత వాటి వైపు పెద్దగా ఎవరూ చూడలేదని ఆయన చెప్పుకొచ్చారు. కానీ తెలుగు దర్శకులు మాత్రం ఆ సంస్కృతిని నాటి కాలం కొనసాగించారని అన్నారు. అదే కారణంతో, అల్లు అర్జున్ అంతటి పెద్ద స్టార్ అయ్యాడని అన్నారు. కరణ్ మాట్లాడుతూ, అల్లు అర్జున్ గతంలో నటించిన చిత్రాలన్నీ హిందీ డబ్బింగ్ తో టీవీ మరియు యూట్యూబ్‌లలో నచ్చినందున శాటిలైట్ స్టార్‌గా ఉండేవారని చెప్పుకొచ్చారు.

    క్రేజ్ తెచ్చుకునేలా చేసిందనేది

    క్రేజ్ తెచ్చుకునేలా చేసిందనేది


    పుష్ప లాంటి వంటి మాస్ సినిమా చేయడంతో ప్రేక్షకులు ఆయనని ఇంకా ఇంకా ఇష్టపడుతున్నారని అన్నారు. ఈ రోజుల్లో ఎవరూ అలాంటి సినిమాలు చేయడం లేదని, తెలుగు సినిమాలు మరీ ముఖ్యంగా కెజిఎఫ్ దేశంలో పెద్ద హిట్ కావడానికి అదే కారణమని ఆయన చెప్పుకొచ్చారు. మట్టి వాసనలు గుర్తు ఎరిగేలా చేసిన ఆ సినిమాలే మాస్ హిస్టీరియాకు కారణమై సినిమాలకు సూపర్ క్రేజ్ తెచ్చుకునేలా చేసిందనేది కరణ్ జోహార్ వాదన.

    క్రేజ్ తెచ్చుకునేలా చేసిందనేది

    క్రేజ్ తెచ్చుకునేలా చేసిందనేది


    అలా , అల్లు అర్జున్ 'పుష్ప' కంటే ముందు హిందీలో శాటిలైట్ స్టార్‌గా పిలవబడేవాడనీ, ఆయన నటించిన పలు సినిమాలు హిందీలో డబ్ అయి, ఎంటర్టైన్మెంట్ ఛానళ్లలో సూపర్ హిట్స్ అయ్యాయని చెప్పుకొచ్చారు. పుష్ప కంటే ముందు ఆయన సినిమాలు నేరుగా హిందీలో విడుదలవకపోయినా, డబ్బింగ్ సినిమాలతో అల్లు అర్జున్ స్టార్‌డమ్ 'శాటిలైట్ స్టార్'గా ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు.

    English summary
    In a recent interview Karan Johar says Allu Arjun was a Satellite Star.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X