NTR for Appu: కర్ణాటకలో ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదు.. ఘన స్వాగతం పలికిన అగ్ర నేతలు
సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమంలోని అగ్ర హీరోలకు కన్నడ రాష్ట్రంలో చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అందులో జూనియర్ ఎన్టీఆర్ కు అయితే మామూలు క్రేజ్ మామూలుగా లేదు అని చెప్పవచ్చు. గతంలో చాలాసార్లు ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాలు కూడా అక్కడ భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాయి. ఇక మెల్లమెల్లగా జూనియర్ ఎన్టీఆర్ స్థాయి అక్కడ మరింత ఎక్కువగా పెరుగుతుంది.
గతంలోనే అతను పునీత్ రాజ్ కుమార్ సినిమాలో ప్రత్యేకంగా ఒక పాట కూడా పాడాడు. దాంతో ఎన్టీఆర్ అక్కడి వరకు కూడా చాలా బాగా దగ్గరయిపోయాడు. చాలా ఇంటర్వ్యూలలో పునీత రాజ్ కుమార్ ఎన్టీఆర్ తనకు సోదరుడి లాంటివాడు అని ప్రతి సినిమాకు సంబంధించి అనేక విషయాలు తమ మాట్లాడుకుంటామని కూడా చెప్పాడు. దీంతో పునీత్ అభిమానులు కూడా ఎన్టీఆర్ ను ఎంతగానో ఆదరిస్తూ వస్తున్నారు. అయితే పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత ఎన్టీఆర్ కూడా ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు.

ఇక ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత కర్ణాటక ప్రభుత్వం అతనికి ప్రత్యేకంగా కర్ణాటక రత్న అవార్డును ప్రకటించింది. అయితే ఈ అవార్డు సంబంధించిన ప్రత్యేకమైన వేడుకను కూడా కర్ణాటకలో నిర్వహించారు. తమిళనాడు నుంచి రజినీకాంత్ ను అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి జూనియర్ ఎన్టీఆర్ను ప్రత్యేక అతిధులుగా ఆహ్వానించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ చార్టెడ్ ఫ్లైట్ లో ఎయిర్ పోర్ట్ లో దిగగానే కర్ణాటక ప్రముఖ మినిస్టర్లు మొత్తం అక్కడే వాలిపోయారు.

జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకంగా ఘన స్వాగతం పలుకుతూ భారీ కాన్వయ్ నడుమ బెంగళూరుకు తీసుకువెళ్లారు. ఇక అక్కడి నుంచి ఎన్టీఆర్ సభకు హాజరు కావడంతో భారీ స్థాయిలో అభిమానులు కూడా హాజరయ్యారు. ఇక ఎన్టీఆర్ మాట్లాడుతూ ఉంటే జోరున వర్షం కూడా కురిసింది. ఎన్టీఆర్ పునీత్ రాజ్ కుమార్ తో ఉన్న అనుబంధాన్ని గురించి కూడా చాలా ఎమోషనల్ గా తెలియజేశారు. ఇక ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.



Click it and Unblock the Notifications











