Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ సూపర్‌స్టార్‌ను చూసి చప్పట్లు కొట్టాలి.. కానీ రిస్క్ చేయొద్దు.. కార్తీ సెన్సేషనల్ కామెంట్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు సూర్య నటిస్తున్న తమిళ సినిమా 'కప్పాన్'. తెలుగులో ఈ సినిమా 'బందోబస్త్'గా ప్రేక్షకుల ముందుకొస్తుంది. సూర్యతోపాటు ప్రముఖ నటుడు మోహన్ లాల్, తమిళ హీరో ఆర్య, హీరోయిన్ సాయేషా సైగల్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యారీస్ జైరాజ్ సంగీతం అందించిన ఈ చిత్ర పాటలను ఆదివారం చెన్నైలో విడుదల చేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో కార్తీ సెన్సేషనల్ కామెంట్లు చేశారు.
హీరో కార్తి మాట్లాడుతూ - నా ఫేవరేట్ యాక్టర్ మోహన్‌లాల్‌గారు. ఆయన అన్నయ్యతో కలిసి పనిచేస్తున్నారని తెలియగానే ఎంతో సంతోషమేసింది. అలాగే ఈ ఫంక్షన్‌కి వచ్చిన రజనీకాంత్‌గారు, శంకర్‌గారు వంటి గొప్ప వాళ్లని చూస్తే.. వారి ప్రయాణమెంత గొప్పగా ఉంటుందో అర్థమవుతుంది. ఇక సినిమా గురించి మాట్లాడాలంటే డైరెక్టర్ కె.వి.ఆనంద్‌గారి గురించి మాట్లాడాలి ప్రేక్షకుడు కొత్తదనాన్ని ఎలా అందివ్వాలా అని ఆలోచిస్తూనే.. సినిమాను ఎంటర్టైనింగ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఇంత గొప్ప సినిమాను నిర్మించిన సుభాస్కరన్ గారికి థ్యాంక్స్. నాకంటే అభిమానులే ఆన్నయ్యను ఎక్కువగా ప్రేమిస్తారు. వారందరికీ ఈ సినిమా తప్పకుండా పెద్ద ఫీస్ట్‌లా ఉంటుందిఅన్నారు.
రజనీకాంత్ నటించిన సినిమాల్లో ఏ సినిమాను రీమేక్ చేయాలని ఉందని యాంకర్ ప్రశ్నించగా.. కార్తీ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. రజనీకాంత్ సినిమాను, ఆయన నటనను చూసి చప్పట్లు కొట్టాలే తప్ప.. రీమేక్ చేయాలనే సాహసం చేయడం పెద్ద రిస్క్. అలాంటి రిస్క్‌ను నేను చేయలేను అని కార్తీ అన్నారు.
ఆ తర్వాత కార్తీ గురించి రజనీకాంత్ మాట్లాడుతూ.. ప్రశంసలు గుప్పించారు. కార్తీ మొదటి సినిమాతోనే ఆకట్టుకొన్నాడు. వంద సినిమాల అనుభవం ఉన్న నటుడిగా నటించాడని అన్నారు. కార్తీని మించేలా నటనతో సూర్య ఆకట్టుకొంటున్నాడని అన్నారు.