కార్తికేయ 2 సెన్సార్ పూర్తి… సెన్సార్ సభ్యుల ఒపీనియన్ ఏమిటంటే?
హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్వామి రారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. విభిన్నమైన చిత్రాలతో చిత్ర సీమలో మంచి మార్కెట్ తో పాటు ఇమేజ్ ని కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఇటీవల ఈ యంగ్ హీరో నటించిన క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అర్జున్ సురవరం మూవీ సైతం మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇక ఆయన నటిస్తున్న కార్తికేయ 2 సెన్సార్ పూర్తయింది. ఆ వివరాలు

కార్తికేయ
దర్శకుడిగా పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్న యంగ్ డైరెక్టర్ చందూ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ చిత్రం కెరియర్ లోనే పెద్ద హిట్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కాన్సెప్ట్ తో పాటు స్క్రీన్ ప్లే, టేకింగ్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా విజయంలో మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది అని చెప్పాలి. 2014లో ఈ మూవీ విడుదల కాగా ఇందులో స్వాతి హీరోయిన్ గా నటించింది.

కార్తికేయ 2
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే... నిఖిల్ ఇప్పుడు మనకు బ్రేక్ ఇచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తికేయ సీక్వెల్ పై చాలాకాలం వర్కౌట్ చేసిన డైరెక్టర్ చందు ఎట్టకేలకు ఈ సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. అయితే జూలై 22న విడుదల కావాల్సిన కార్తికేయ 2 కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. వెంటనే ఈ సినిమాను ఆగస్ట్ 12న విడుదల చేయబోతున్నట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కార్తికేయ 2 మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు మేకర్స్.

సెన్సార్ సభ్యుల ప్రకారం
తాజా సమాచారం ప్రకారం కార్తికేయ 2 మూవీకి సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికెట్ ను అందించారు. ఇక విశేషమేమంటే సినిమాకు సెన్సార్ సభ్యులు ఒక్కటంటే ఒక కట్ కూడా చెప్పలేదట. అంతేకాదు సినిమాకు వారి నుండి పాజిటివ్ రివ్యూ వచ్చిందని తెలుస్తోంది. సెన్సార్ సభ్యుల ప్రకారం సినిమా టాక్ ఏంటంటే... కార్తికేయ-2 అజంతం ఆసక్తికరంగా సాగుతూ ఆలోచింపజేసే విధంగా ఉందట. అంతేకాదు సినిమా విజువల్ ట్రీట్ అని, కథ స్క్రీన్ ప్లే తో పాటు లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ బాగుందంటూ సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ ని అభినందించారని సమాచారం.

బాగా నచ్చుతుందని
ఇక సెన్సార్ టీం ఒపీనియన్ తెలుసుకున్నాక కార్తికేయ 2 టీం సినిమా ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుందని నమ్మకంతో ఉన్నారు. కార్తికేయ 2 మూవీని భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కనిపించనుంది.

ఆగస్టు వరకు
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పుడు కార్తికేయ 2 మూవీ హిట్ కావడం నిఖిల్ కి కూడా చాలా అవసరం అని చెప్పాలి. మరి ఈ సినిమా నిఖిల్ అభిమానులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఆగస్టు వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











