మరో సినిమాకు కమిటైన ‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ... ఈసారి రెజ్లర్‌గా!

'ఆర్ఎక్స్ 100' సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన కార్తికేయకు వరుస అవకాశాలు వస్తున్నాయి. పలువురు ఫిల్మ్ మేకర్స్ విభిన్నమైన కథలతో ఈ యంగ్ హీరోను అప్రోచ్ అవుతున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కార్తికేయ మరో ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెజ్లింగ్ బ్యాక్ డ్రాప్‌తో ఉంటుందని, కథ సైతం ఆసక్తికరంగా ఉంటుందని. తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు రాని ఒక కొత్త తరహా స్క్రీన్ ప్లేతో ఈ మూవీ ఉండబోతోందని అంటున్నారు.

పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

Karthikeya next movie with wrestling backdrop

వెంకట్‌ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ మూవీని ఎం.ఎస్ రెడ్డి స్టూడియోస్ వారు నిర్మించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందని, 2019 జనవరిలో షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని టాక్.

మరో వైపు... 'ఆర్ఎక్స్ 100' తర్వాత కార్తికేయ 'హిప్పి' అనే సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత.... వెంకట్ చంద్ర దర్శకత్వంలో సినిమా ఉంటుంది. రెజ్లింగ్ నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి కార్తికేయ మరింత బరువు పెరుగుతాడని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X