యువ హీరోకు కరోనా షాక్.. చేతులెత్తేసిన నిర్మాత..
బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్‌కు నిర్మాతలు షాకిచ్చారు. ఓం రౌత్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 3డీ మూవీ షూటింగును నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు పలు దేశాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ జరపలేమని స్పష్ం చేశారు. ఈ చిత్రాన్ని టీ సీరిస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
కార్తీక్ ఆర్యన్ 3డీ థ్రిల్లర్ సినిమా షూటింగ్ వాయిదా వేశాం. ఈ సినిమాను విదేశాల్లో చిత్రీకరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పలు దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ హంకాంగ్‌లో చేయాల్సింది. కరోనా కారణంగా సాధ్యపడలేదు. ఈ యాక్షన్ సినిమాకు సంబంధించిన షూటింగు డేట్లను తర్వాత పరిస్థితుల అనుకూలతన బట్టి ప్రకటిస్తామని యూనిట్ వెల్లడించింది.

ఇక ఓం రౌత్ విషయానికి వస్తే.. తానాజీ: ది అన్‌సంగ్ వారియర్ అనే సినిమాను అజయ్ దేవగన్, సైఫ్ ఆలీ ఖాన్, కాజోల్‌తో చిత్రీకరించారు. ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఆ తర్వాత ఆర్యన్ కార్తీక్‌తో రౌత్ సినిమాను యాక్షన్ 3డీ చిత్రాన్ని ప్రారంభించారు.
ఆర్యన్ కార్తీక్ కెరీర్ విషయానికి వస్తే.. భూల్ భులయ్యా2, దోస్తానా 2 సినిమాలో నటిస్తున్నారు. అలాగే కరణ్ జోహర్ రూపొందించే ఓ చిత్రంలో జాన్వీ కపూర్; లక్ష్ లాల్వానీ హీరోయిన్లతో కలిసి ఆర్యన్ నటించనున్నారు.


Click it and Unblock the Notifications











