హీరో కార్తీకేయ కేక.. అరుదైన ఘనతతో అదుర్స్
RX 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కార్తీకేయ గుమ్మకొండ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. తొలి చిత్రంతోనే ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగిన కార్తీకేయ హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన 2018లో మోస్ట్ డిజైరబుల్ సెలబ్రిటీ క్యాటగిరీలో 19వ స్థానాన్ని దక్కించుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
హైదరాబాద్ టైమ్స్ పేర్కొన్న ప్రకారం.. పెద్దగా చిత్రాలు చేయకపోయినా.. ఒకే చిత్రంతో వరంగల్‌కు చెందిన ఈ కుర్రాడు దుమ్మురేపాడు. RX100 చిత్రంలో బోల్డ్ సీన్లలో హాట్ హాట్‌గా నటించి ప్రేక్షకుల మనసు దోచుకొన్నాడు. తన నటనతో సినీ ఇండస్ట్రీ వర్గాలను తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. తన తదుపరి చిత్రం హిప్పీలో యాక్షన్ ప్యాక్డ్ రోల్‌లో నటిస్తున్నాడు.

హీరోగా నిలదొక్కుకున్న కార్తీకేయ ఇంకా బ్రహ్మచారి. సిక్స్ ప్యాక్‌తో సెక్సీగా కనిపించే యువ హీరోల్లో ఇకరు. అందరినీ ఆకట్టుకొనేలా సెక్సీ లుక్ ఉండటం అతడికి ప్లస్ పాయింట్ అని హైదరాబాద్ టైమ్స్ పేర్కొన్నది.


Click it and Unblock the Notifications











