twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఛాలెంజ్‌‌ను స్వీకరించిన కార్తికేయ.. ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపు

    |

    గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో దశను ఎంపీ సంతోష్ కుమార్ ఇటీవలె ప్రారంభించిన సంగతి తెలిసిందే. డార్లింగ్ ప్రభాస్ చేతుల మీదుగా మొదలైన ఈ మూడో దశ బాగానే వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ప్రభాస్ తన ఇంటి ప్రాంగణంలోనే మొక్కలు నాటాడు. ఎంపీ సంతోష్‌తో కలిసి మొక్కలతో పాటు సెల్ఫీ దిగాడు. ఇక ప్రభాస్ మొదలెట్టిన ఈ ఛాలెంజ్ క్రమ క్రమంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం యంగ్ హీరో కార్తికేయ తన వంతుగా మొక్కలు నాటాడు.

    అయితే కార్తికేయ వద్దకు ఈ ఛాలెంజ్ విశ్వక్‌సేన్ నుంచి వచ్చింది. ఫలక్ నుమా దాస్ ఫేస్ విశ్వక్‌సేన్ విసిరిన సవాల్‌ను విసిరిన హీరో కార్తికేయ తన వంతుగా మొక్కలు నాటాడు. ఈ మేరకు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేస్తూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించాను మూడు మొక్కలను నాటానని పేర్కొన్నాడు. అందరూ కూడా మొక్కలు నాటాలని కోరాడు.

    Kartikeya gummakonda Accepted Green India Challenge

    కార్తికేయ మాట్లాడుతూ ప్రపంచంలో వాతావరణం మనల్ని ప్రశ్నిస్తుంది అని పర్యావరణం రక్షించుకోవడం అందరి బాధ్యత అని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని రక్షించాలని కోరారు ఈ చాలెంజ్ లో నన్ను భాగస్వామ్యం చేసిన చేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. కార్తికేయ ప్రస్తుతం చావు కబురు చల్లగా అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. లాక్ డౌన్ కారణంగా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది.

    English summary
    Kartikeya gummakonda Accepted Green India Challenge. I've accepted #HaraHaiTohBharaHai #GreenindiaChallenge & planted 3 saplings.I request everyone to take it as a responsibility & plant trees to protect our environment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X