Bhaag Saale ఓ వైపు ఆస్కార్ అవార్డులు.. మరోవైపు రాజమౌళి, కీరవాణి.. హీరో కార్తికేయ ఎమోషనల్ స్పీచ్
శ్రీసింహా కోడూరి హీరోగా తాజా చిత్రం భాగ్ సాలే. నేహా సోలంకి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే విడుదవుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో కార్తికేయ విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్తీకేయ మాట్లాడుతూ..
మేము ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఆ సమయంలో ఈ ప్రొడ్యూసర్‌ను, డైరెక్టర్‌ను కలిశాను. మేము ఓ సినిమా చేస్తున్నాం. దాని టైటిల్ భాగ్ సాలే అనుకొంటున్నామని చెబితే.. ఆ టైటిల్ మేము ఈ మధ్య పెట్టుకొన్నామని చెప్పారు. దాంతో థ్యాంక్యూ అని అన్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ బాగుంది. ఇప్పటి వరకు భాగ్ సాలే అంటే మహేష్ బాబు గుర్తుకు వచ్చేవాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత భాగ్ సాలే అంటే ఈ సినిమానే గుర్తుకు వస్తుంది అని కార్తీకేయ అన్నారు.
కాలభైరవ నాకు సీనియర్. నాకు యమదొంగ టైమ్ నుంచి తెలుసు. తన ఫ్యామిలీలో ఎంతో సాధించిన వాళ్లు ఉన్నప్పడు.. వారి మధ్య కనిపించాలంటే చాలా కష్టం. ఇంటికి వెళితే.. ఆస్కార్ అవార్డులు, రాజమౌళి, కీరవాణి ఉంటారు. వారి మధ్య ఉంటూ మనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడం కష్టం. కానీ సింహా చాలా బాగా చేస్తున్నాడు. ఆయన సినిమాల ఎంపిక బాగుంది అి కార్తీకేయ చెప్పారు.
రాజమౌళి, కీరవాణి లాంటి వాళ్లు తన ఫ్యామిలీలో గొప్ప వాళ్లు ఉన్నప్పటికీ సింహా చాలా సింపుల్‌గా ఉంటాడు. సింహాకు మంచి హిట్స్ రావాలని కోరుకొంటున్నాను. మొదటి సినిమాకే మంచి హిట్ కొట్టారు. ఫ్యూచర్‌లో బ్లాక్ బస్టర్ సినిమాలను కొట్టాలి అని కార్తీకేయ అన్నారు.

కాలభైరవ గురించి కార్తీకేయ మాట్లాడుతూ.. ఆయన వాయిస్‌కు ఫ్యాన్‌ను. అన్ని విధాలుగా ప్రూవ్ చేసుకొంటున్నారు. అవకాశం వస్తే మీతో పనిచేయాలని కోరుకొంటున్నాను అని అన్నారు. ప్రణీత్ గారు.. ట్రైలర్ బాగుంది. ఈ సినిమాలో నేహా సోలంకి హీరోయిన్. నాతో 90ఎంఎల్ సినిమాలో నటించారు. అందరికి మంచి జరగాలని కోరుకొంటున్నాను. జూలై 7వ తేదీన రిలీజ్ అవుతున్నది. నేను కూడా థియేటర్‌లో చూస్తాను అని కార్తీకేయ తెలిపారు.


Click it and Unblock the Notifications











