కరోనాను ఆర్ ఎక్స్ 100తో తొక్కేయండి.. అజయ్ భూపతిపై కార్తికేయ కామెంట్

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకు కొన్ని వేల కేసులు నమోదు అవుతున్నాయి. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలోనూ కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి, అతని కుటుంబానికి కరోనా సోకింది. రెండు వారాల క్వారంటైన్ తరువాత కరోనా నెగెటివ్ వచ్చిందని తాజాగా తెలిపాడు. అంతకు ముందు బండ్ల గణేష్‌కు కరోనా సోకింది.

ఇక టీవీ ఇండస్ట్రీలో అయితే కరోనా పట్టిపీడిస్తోంది. సీరియల్ షూటింగ్‌లు మొదలుపెట్టినప్పటి నుంచి రోజు ఎవరో ఒకరు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఇలా అందరూ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతికి కరోనా సోకింది. ఈ మేరకు దర్శకుడు చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. వచ్చేసింది.. త్వరలోనే వస్తా.. ప్లాస్మా ఇస్తా.. అంటూ ట్వీటేశాడు.

Kartikeya Gummakonda On Ajay bhupathi About Corona

ఇక నేడు దర్శకుడు అజయ్ భూపతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా హీరో కార్తికేయ స్పందించాడు. తనను హీరోగా నిలబెట్టిన దర్శకుడు కరోనా బారిన పడటంపై సెటైర్ వేశాడు. 'హ్యాపీ బర్త్ డే ట్వీట్ చేద్దామనుకుంటుంటే.. కరోనా గురించి ట్వీట్ చేసేలా చేశారేంటి సర్.. ఇందులో కూడా పాత్ బ్రేకింగ్‌లా ఉన్నారు మీరు.. ఏం పర్లేదు సర్ కరోనాని ఆర్ఎక్స్ 100తో తొక్కేసి వచ్చేయండి.. హ్యాపీ బర్త్ డే సర్.. ఫాస్ట్ ఫాస్ట్‌గా రికవర్ అయిపోండి.. త్వరలోనే మిమ్మల్ని చూస్తాను' అంటూ ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X