పెళ్లి చేసుకోవడంతో కెరీయర్ నాశనం.. RX100 హీరో కార్తీకేయ క్లారిటీ
టాలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషన్ హీరో కార్తీకేయ గుమ్మకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో కార్తీకేయ గుమ్మకొండ హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. డాషింగ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక్ గుమ్మకొండ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించారు. వారి ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ కు తెలుగు ఆడియెన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు. దీంతో హీరోగా కార్తీకేయకు, అటు హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ కు, దర్శకుడిగా అజయ్ భూపతికి మంచి గుర్తింపు దక్కింది. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకోవడం కాకుండానే రూ.2 కోట్ల నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.27.4 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసింది.
కార్తీకేయకు ఆర్ఎక్స్ 100 చిత్రం తర్వాత వరుస ఆఫర్లను అందుకున్నారు. హిప్పి, గుణ 369, 90ఎంఎల్, చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క, బెదరులంక వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు. తెలుగు ఆడియెన్స్ ను విభిన్న కథలతో అలరించారు. చివరిగా 'భజే వాయు వేగం' సినిమాతో థియేటర్లలో సందడి చేశారు. అయితే ఆర్ ఎక్స్ 100 చిత్రం తర్వాత కార్తీకేయ గుమ్మకొండకు పెద్ద హిట్స్ పడలేదనే చెప్పాలి. తొలి చిత్రంతో దక్కిన సినిమాతోనే ఇప్పటి వరకు నెట్టుకూ వస్తున్నాడని అంటున్నారు.

ఇదిలా ఉంటే.. కార్తీకేయ సినిమాల్లో రాణించకపోవడానికి కారణం అతని సరైన కెరీయర్ బిల్డ్ కాకముందే పెళ్లి అవ్వడమేనని పలువురు అభిప్రాయడుతున్నారు. అయితే దీనిపై యంగ్ హీరో కార్తీకేయ గుమ్మకొండ స్పందించారు. తను యంగ్ ఏజ్ లోనే 28 ఏళ్లకే పెళ్లి చేసుకున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే అప్పటికే నటుడిగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అదే సమయంలో పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో పలువురు కార్తీకేయను వద్దని సలహా ఇచ్చారంట.
ఇండస్ట్రీలో సరైన హిట్, మార్కెట్ ఏర్పడకుండా ఎలా పెళ్లి చేసుకుంటావని అడిగారంట. అయితే అవన్నీ ఏమీ పట్టించుకోలేదని, అయినా తన కెరీయర్ బాగానే సాగిందన్నారు. అలాగంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరికీ పెళ్లిళ్లు అయ్యాయి కదా అని తనను తాను ప్రశ్నించుకున్నట్టు చెప్పారు. అంతే కాకుండా చిత్ర పరిశ్రమలో వెలుగొందాలంటే సినిమా బాగుండాలంతే అని తన అభిప్రాయాన్ని చెప్పారు. అయితే తాజాగా కార్తీకేయ చిరంజీవి 157కు విలన్ గా ఎంపికయ్యారని బజ్ ఏర్పడింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
ఈ సందర్భంగా తన పాత ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. గతంలో నాని గ్యాంగ్ స్టర్, అజిత్ కుమార్ 'వలిమై' చిత్రాల్లో నెగెటివ్ రోల్స్ లో నటించారు. ఇక కార్తీకేయ గుమ్మకొండ ప్రస్తుతం 32 ఏళ్ల వయస్సుకు చేరుకున్నారు. అతనికి 2021లోనే అతనికి వివాహామైంది. తన కాలేజీలోనే ప్రేమించిన లిఖితా రెడ్డిని వివాహాం చేసుకున్నారు. దాదాపు 11 ఏళ్లు వీళ్లు ప్రేమలో మునిగి తేలారు. ఇక ప్రతి ఏడాది వారి వివాహా వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











