వాళ్లకు వడ్డీతో సహా ఇచ్చేస్తా.. హీరోయిన్‌పై అనుమానం ఉండేది: హీరో కార్తికేయ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్‌లోకి ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తనదైన టాలెంట్లతో సత్తా చాటి విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు కార్తికేయ గుమ్మకొండ. ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్ అయిన అతడు.. ఆ తర్వాత చాలా ప్రయత్నాలే చేశాడు. కానీ, భారీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు అతడు 'బెదురులంక 2012' అనే సినిమాను చేశాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా నిర్వహించారు. ఇందులో హీరో కార్తికేయ అదిరిపోయే స్పీచ్‌ ఇచ్చాడు. ఇంతకీ అతడు ఏం మాట్లాడాడో మీరే చూసేయండి!

బెదురులంకలో ఏం జరిగింది?:కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన తాజా చిత్రమే 'బెదురులంక 2012'. క్లాక్స్ తెరకెక్కించిన ఈ సినిమాను లౌక్యా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ముప్పనేని రవీంద్ర బెనర్జీ నిర్మించారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యలు కీలక పాత్రలు చేశారు. దీనికి మణిశర్మ మ్యూజిక్ ఇచ్చారు. బెదురులంకలో ఏం జరిగింది అనే కథతో ఇది వస్తుంది.

Kartikeya Gummakonda Speech at Bedurulanka 2012 Event

గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్:ఫన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'బెదురులంక 2012' మూవీని ఆగస్టు 25వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ ఫంక్షన్ ఎంతో వైభవంగా జరిగింది. దీనికి చాలా మంది అభిమానులు వచ్చి ఈవెంట్‌ను సక్సెస్‌ఫుల్ చేసేశారు.

ఈ చిత్రంతో రీ ఇంట్రడ్యూస్:'బెదురులంక 2012' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కార్తికేయ మాట్లాడుతూ.. 'ఇప్పటి వరకూ నేను చాలా సినిమాలు చేశాను. అందులో చాలా పాత్రలో ప్లే చేశాను. అవన్నీ ఒక ఎత్తు.. ఇది మాత్రం మరో ఎత్తు. 'ఆర్ఎక్స్ 100' మూవీలో శివ అనే పాత్రను చేశాను. ఈ సినిమాలో కూడా అదేలా కనిపిస్తా. ఒక విధంగా చెప్పాలంటే ఈ మూవీతో నేను రీ ఇంట్రడ్యూస్ అవుతున్నా' అన్నాడు.

Kartikeya Gummakonda Speech at Bedurulanka 2012 Event

టీమ్ మొత్తం షాక్‌లో ఉంది:కార్తికేయ కంటిన్యూ చేస్తూ.. 'సాధారణంగా స్టోరీ నెరేషన్‌కు గంటన్నర టైం పడుతుంది. కానీ, ఈ మూవీ స్టోరీ క్లాక్స్ నాకు ఆరు గంటల వరకూ చెప్పాడు. అది విన్న వెంటనే సినిమా చేస్తున్నాం అని చెప్పాను. వాస్తవానికి నేను చాలా ప్లాన్ చేసుకుని మూవీలు చేయాలని అనుకున్నా. కానీ, ఇది విన్న వెంటనే ఒప్పుకోవడంతో నా టీమ్ మొత్తం షాక్‌లో ఉండిపోయింది' అని వివరించాడు.

Kartikeya Gummakonda Speech at Bedurulanka 2012 Event

నేహాపై చాలా డౌట్లు ఉండేవి:కార్తికేయ కొనసాగిస్తూ.. 'వాస్తవానికి ఈ మూవీలో హీరోయిన్‌గా చాలా మందిని అనుకున్నాం. అప్పుడు నిర్మాత నేహా శెట్టి పేరు చెప్పారు. ఆమె 'రాధిక' క్యారెక్టర్‌తో సెన్సేషన్ అయింది. అలాంటిది పల్లెటూరి అమ్మాయిలా చేస్తుందా అని డౌట్లు ఉండేవి. తను కూడా ఇదే భయంతో చాలా జాగ్రత్తలు తీసుకుంది. తన పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేసింది' అన్నాడు.

Kartikeya Gummakonda Speech at Bedurulanka 2012 Event

వాళ్లకు వడ్డీతో సహా ఇచ్చేస్తా:హీరో కార్తికేయ మాట్లాడుతూ.. 'వాస్తవానికి నేను చాలా సినిమాలు చేశాను. అవన్నీ నిరాశనే మిగిల్చాయి. దీంతో చాలా టైం కూడా వేస్ట్ అయింది అనిపించింది. అయినా నన్ను అభిమానులు చాలా ఎంకరేజ్ చేశారు. డైలాగ్ కాస్త ఓవర్‌గా ఉన్నా సరే ఇప్పుడు చెప్తున్నా.. మీ అందరికీ ఈ సినిమాతో హిట్ కొట్టి ఆ పోయిన సమయాన్ని మొత్తం వడ్డీతో సహా ఇచ్చేస్తాను' అని పేర్కొన్నాడు.

Kartikeya Gummakonda Speech at Bedurulanka 2012 Event

నచ్చితే నలుగురికి చెప్పండి:ఈ వేడుకలో కార్తికేయ 'ఈ సినిమాను మేము జెన్యూన్‌గా చేశాం. ఎక్కడా స్వార్థంగా ఆలోచించలేదు. కచ్చితంగా ఇది మిమ్మల్ని అందరినీ ఆకట్టుకుంటుంది. దీన్ని థియేటర్లలో చూడండి.. నచ్చితే నలుగురికి చెప్పండి. బెదురులంకను బ్లాక్ బస్టర్ చేస్తే ఇంకా ఉత్సాహంగా పని చేస్తా. ఈ చిత్రంలో పని చేసిన నటీనటులు, టెక్నీషియన్లు అందరికీ థ్యాంక్స్' అని ముగించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X