ఆర్ఎక్స్ 100 హీరో న్యూ లుక్.. నెవర్ బిఫోర్ అనేలా ఫిట్నెస్ తో అదరగొట్టేసాడు

సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబందం లేకుండా ఛాన్స్ లు అందుకుంటున్న హీరోలలో కార్తికేయ ఒకరు. ఆర్ఎక్స్ 100 సినిమాతో పవర్ఫుల్ బాక్సాఫీస్ హిట్ అందుకున్న కార్తికేయ ఆడియెన్స్ ను ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. నటనలో ఈ హీరోకు మంచి మార్కులే పడుతున్నాయి గాని బాక్సాఫీస్ వద్ద ఇంకా సరైన హిట్స్ మాత్రం పడటం లేదు. అయినప్పటికీ కార్తికేయ ఏ మాత్రం తగ్గకుండా ఫిట్నెస్ తో కూడా ప్రయోగాలు చేస్తున్నాడు.

ఆ ఒక్క సినిమాతో

ఆ ఒక్క సినిమాతో

అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక సినిమాలో కార్తికేయ నటనకు కూడా మంచి క్రేజ్ దక్కింది. నటుడిగా అంతకుముందు కొన్ని సినిమాలు చేసినప్పటకి వర్కౌట్ కాలేదు. ఇక ఆర్ఎక్స్ 100 అనంతరం ఒక్కసారిగా ఆఫర్స్ వెల్లువలా వచ్చాయి.

మంచి క్రేజ్ అందుకున్న కార్తికేయ

మంచి క్రేజ్ అందుకున్న కార్తికేయ

వచ్చిన ప్రతి ఆఫర్ ను ఓకే చేయకుండా కార్తికేయ కేవలం తనకు నచ్చిన పాత్రలను మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా తనదైన శైలిలో నెగిటివ్ పాత్రల్లో విలన్ గా కూడా నటించాడు. నాని హీరోగా చేసిన గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తికేయ విలన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ద్వారా కూడా కార్తికేయ మంచి క్రేజ్ అందుకున్నాడు.

సరికొత్తగా సిక్స్ ప్యాక్ లుక్

సరికొత్తగా సిక్స్ ప్యాక్ లుక్

అసలు మ్యాటర్ లోకి వస్తే కార్తికేయ ఇప్పుడు డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. సరికొత్తగా సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపిస్తూ ఆడియెన్స్ షాక్ ఇచ్చాడనే చెప్పాలి. చూస్తుంటే నెక్స్ట్ సినిమాలో ఎదో వండర్ క్రియేట్ చేసేలా ఉన్నాడని అనిపిస్తోంది. కార్తికేయ చాలా వరకు కథలకు తగ్గట్లుగానే ఫిట్నెస్ లో మార్పులు తెస్తున్నట్లు సమాచారం.

చావు కబురు చల్లగా

చావు కబురు చల్లగా

ఇక ఈ సారి 'చావు కబురు చల్లగా సినిమాతో' ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన టీజర్ సాంగ్స్ ను ఇటీవల రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో అవి వైరల్ గా మారాయి. మొత్తానికి ఆ సినిమా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేసేశారు. మార్చ్ 19న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల ఒక ఫన్నీ పోస్టర్ ద్వారా తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X